ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లి వార్త ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కీర్తి సురేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన దసరా సినిమా హిట్ అయినప్పటి నుంచి కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందని .. త్వరలోనే ఓ ఇంటిది కాబోతుంది అంటూ పలు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు కీర్తి సురేష్ రీసెంట్గా తన ఫ్రెండ్ తో దిగిన ఫోటోను షేర్ చేయడంతో అందరూ అది కన్ఫామ్ అనుకున్నారు .
ఆ అబ్బాయిని కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందని .. త్వరలోనే ముహూర్తం కూడా పెట్టి ఆ న్యూస్ అఫీషియల్ గా ప్రకటించబోతుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే కీర్తి సురేష్ అతను నా ఫ్రెండ్ ఇలాంటి వార్తలు పుట్టించొద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది .తాజాగా ఈ బ్యూటీ మామన్నన్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ లో పాల్గొంది. ఇందులో ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ జంటగా నటించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్ గా చెన్నై లో ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. కమల్ హాసన్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ ఈవెంట్లో హోస్ట్ కీర్తి సురేష్ వద్ద పెళ్లి ప్రస్తావని తీసుకోచ్చారు. దీంతో కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ” ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారండి ..ఆల్రెడీ నా పెళ్లి పై క్లారిటీ ఇచ్చేశాను . మళ్ళీ ఎందుకు పదే పదే నా పెళ్లి గురించి అడుగుతారు . అసలు ఎందుకు ఈ సోషల్ మీడియాలో .. నా పెళ్లి వార్త ఇంత వైరల్ అవుతుందో అర్థం కావడం లేదు. మీ అందరికీ ఒకటే చెబుతున్నాను నాకు ఎటువంటి బాయ్ ఫ్రెండ్ లేడు .. నా వెడ్డింగ్ ప్లాన్స్ ఇంకా ఏం అనుకోలేదు..
నా వెడ్డింగ్ ప్లాన్స్ మొదలుపెట్టాక నేనే స్వయంగా అందరికీ నా పెళ్లి డేట్ ని చెప్తాను. అప్పటివరకు ఆగండి.. ప్రతి ఒక్కరూ నా పెళ్లి గురించి అడిగి అడిగి విసిగించవద్దు ప్లీజ్” అంటూ కీర్తి సురేష్ రిక్వెస్ట్ చేస్తూ స్ట్రాంగ్ గా ఇచ్చి పడేసింది . పెళ్లి గిల్లి లాంటి ఉంటే నేనే చెప్తాను అంటుందిగా.. వదిలేయ్యండి .. ఇంకెందుకు పదేపదే ఆమెను విసిగించడం.. లైట్ తీసుకోండి అంటూ కూల్ గా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు..!!