Moviesక్రిటికల్ గా జబర్ధస్త్ కమెడియన్ ఆరోగ్య పరిస్ధితి.. చేతులెత్తేసిన డాక్టర్లు..ఇక ఆ...

క్రిటికల్ గా జబర్ధస్త్ కమెడియన్ ఆరోగ్య పరిస్ధితి.. చేతులెత్తేసిన డాక్టర్లు..ఇక ఆ దేవుడే దిక్కు..!!

జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకున్న పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి జబర్దస్త్ ద్వారా పిచ్చ క్రేజ్ పాపులారిటీ సంపాదించుకొని జబర్దస్త్ లోకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ గా మారిపోయాడు. ఆయన పంచ్ వేస్తే ఎలాంటి మనిషి అయినా సరే నవ్వాల్సిందే. హెల్దీ పంచెస్ వేయడం వల్గారిటికి దూరంగా ఉండడం పంచ్ ప్రసాద్ కి మొదటి నుంచి అలవాటు . జబర్దస్త్ లో ఎంత వల్గారిటి కంటెంట్ పెరిగిపోయిన తన హద్దులను ఏనాడు మీరు లేదు పంచ్ ప్రసాద్ .

దీంతో పంచ్ ప్రసాద్ ని జనాలు బాగా లైక్ చేసేవారు . అయితే పంచ ప్రసాద్ కి ఆరోగ్య పరిస్థితి బాగోలేదన్న విషయం అందరికీ తెలిసిందే. మూడేళ్ల క్రితం రెండు కిడ్నీలు పాడైపోయాయి . ఈ క్రమంలోనే ఒకదాని వెంట ఒకటి ఆయనకి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి . గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీనికోసం ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెగ్యులర్గా డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదని అలా అలా ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా వీడియోని రిలీజ్ చేశారు.

అంతేకాదు డాక్టర్లు సైతం ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసి చేతులెత్తేసారని ..ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని ..లేకపోతే ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేమన్నారట. ఇదే విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఎవరైనా దాతలు సహాయం చేయండి అంటూ బ్యాంక్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ను షేర్ చేశారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఫోటోని సైతం పోస్ట్ చేశారు . ఈ వీడియోలో పంచ్ ప్రసాద్ ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని చాలా దయనీయస్థితిలో ఉన్నారు . ఈ ఫోటో వీడియో చూసిన వాళ్లు పంచ ప్రసాద్ త్వరగా కోలుకోవాలని మళ్లీ జబర్దస్త్ లోకి రావాలని కోరుకుంటున్నారు . మరికొందరు తగిన సహాయం చేస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వాలని ప్రార్థిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news