గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ యంగ్ టైగర్ గా ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్ సినిమాలపరంగా టాప్ పొజిషన్లో ఉన్నాడు . అంతేకాదు ఫ్యామిలీ పరంగా కూడా ఎన్టీఆర్ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారు . దానికి మెయిన్ రీజన్ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి అనే చెప్పాలి . లక్ష్మీ ప్రణతి ఆయన జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆయనకు యమ రేంజ్ లో కలిసి వచ్చింది.
కెరియర్ మొదట్లో హిట్ల కోసం నానా తంటాలు పడిన .. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ హిట్లను అందుకొని .. ఆ తర్వాత పాన్ ఇండియా హీరోగా .. ఆ తర్వాత గ్లోబల్ స్థాయి హీరోగా ఎన్టీఆర్ ఫేమస్ అయిపోయాడు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ – లక్ష్మి ప్రణతిల పెళ్లికి సంబంధించిన మేటర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే ఎన్టీఆర్ లక్ష్మీప్రణతలది పెద్దలు కుదిర్చిన వివాహం .
చంద్రబాబునాయుడు గారి బంధువే లక్ష్మీ ప్రణతి . ఇలా చుట్టరికం కలుపుకున్నాడు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి కంటే ముందే ఓ రాజకీయ నేత కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారట . చంద్రబాబు నాయుడు టిడిపిలో ఉండే టాప్ లీడర్ కూతురుతో ఎన్టీఆర్ వివాహం చేయాలనుకున్నారట. అయితే ఎన్టీఆర్ కి కూడా అమ్మాయి బాగా నచ్చేసింది అంట .
అయితే ఎన్టీఆర్ మదర్ కి మాత్రం ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నచ్చక వద్దు అంటూ రిజెక్ట్ చేసిందట . అయితే ఆ తర్వాత వచ్చిన లక్ష్మీ ప్రణతి సంబంధాన్ని ఎన్టీఆర్ అమ్మగారు కూడా నచ్చడంతో చక చక పెళ్లి చేసేసారు. ఒకవేళ ఎన్టీఆర్ అమ్మగారు గాని ఆ అమ్మాయినే ఒప్పుకొని ఉంటే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతికంటే ముందే ఆ టిడిపి టాప్ లీడర్ కూతురిని వివాహమాడుండేవారు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!