Moviesఆ సినిమా అంటే చచ్చేంత ఇష్టం.. కానీ ఆఫర్ వస్తే రిజెక్ట్...

ఆ సినిమా అంటే చచ్చేంత ఇష్టం.. కానీ ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసిన కృతి శెట్టి..ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న కృతిశెట్టి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  మెగా మేనల్లుడు వైష్ణవ్  తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి  శెట్టి మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత నటించే రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.

దీంతో  బేబమ్మ జాతకం ఎటో మారిపోతుంది అనుకున్నారు జనాలు . అయితే అటు తిరిగి ఇటు తిరిగి ఆ తర్వాత నటించిన నాలుగు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో గిరగిరా తిరుగుతూ అక్కడ స్టాచ్యులా ఉండిపోయింది .  కృతి శెట్టికి ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్న బాలకృష్ణ అంటే మహా మహా ఇష్టమట.  మరి ముఖ్యంగా ఆయన చెప్పే మాస్ డైలాగ్స్ కు పిచ్చ ఫ్యాన్ ఈ కృతి శెట్టి అంటూ తెలుస్తుంది .

అయితే ఇంత మంచి ఫ్యాన్ అయినా ఆయనతో నటించే అవకాశం వస్తే కృతి శెట్టి చేతుల్లారా జారవిడుచుకుంది . ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూతురు పాత్ర కోసం శ్రీలీల కన్నా ముందే కృతిశెట్టిని  అప్రోచ్ అయ్యాడట అనిల్ రావిపూడి.  అయితే అమ్మడు సున్నితంగా ఈ పాత్రని  రిజెక్ట్ చేసింది.  దానికి కారణం ఏంటనేది మాత్రం తెలియ రాలేదు . దీంతో  సోషల్ మీడియాలో కృతిశెట్టి ని ఆడేసుకుంటున్నారు నందమూరి అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news