శ్రీదేవి ముద్దుల కూతురుగా పాపులారిటీ సంపాదించుకుని ఇండస్ట్రీలో తన స్టైల్ లో దూసుకుపోతున్న జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అమ్మడు హవా ఎక్కువగా కొనసాగుతుంది . తెలుగులో ఆమె నటించిన ఒక్కటంటే ఒక్క సినిమా రిలీజ్ అవ్వనప్పటికీ మూడు సినిమాలకు సైన్ చేసి సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది .
అయితే జాన్వి కపూర్ దేవర సినిమా కంటే ముందే తెలుగులో వేరే సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉందని .. తన మేనేజర్ చేసిన తప్పుడు నిర్ణయం కారణంగా.. ఈ అమ్మడు ఈ సినిమా నుంచి అవుట్ అయిందని తెలిసి జనాలు బాధపడిపోతున్నారు . ఇంతకీ ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా ..? అక్కినేని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అఖిల్ కెరియర్ లోనే హిట్ అయిన సినిమాగా రికార్డు నమోదు చేసుకుంది . ఈ క్రమంలోనే మొదట డైరెక్టర్ ఈ సినిమాలో జాన్వికపూర్ ని హీరోయిన్ గా అనుకున్నారట. అయితే జాన్వికపూర్ కి కూడా ఈ కథ నచ్చగా ఓకే చేసిందట . కానీ ఆమె మేనేజర్ అఖిల్ ట్రాక్ రికార్డు చెప్పి జాన్విని భయపెట్టేసి ఈ సినిమా నుంచి తప్పుకునేలా చేసాడట. దీంతో పూజ హెగ్డే ఆ స్థానంలో కి వచ్చింది .. ఇలా జాన్వి కపూర్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నింది..!!