టాలీవుడ్ బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి ని ఆ స్టార్ డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడా..? అంటే అవునని అంటుంది కృతి శెట్టి . ఈ విషయాన్ని స్వయాన ఆమె చెప్పకు వచ్చింది . మనకు తెలిసిందే ఉప్పేన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ బిజీ బిజీ గా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది .
ఇక తర్వాత వచ్చిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోనే కృతి శెట్టిని జనాలు మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు . అయితే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న వెంకట్ ప్రభు మాత్రం కృతిశెట్టిని పిలిచి మరి అవకాశాలు ఇస్తున్నారు. రీసెంట్ గానే ఆయన దర్శకత్వంలో “కస్టడి” అనే సినిమాలో నటించిన కృతి శెట్టి.. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో బాగా డీలా పడిపోయింది .
అయితే వెంకట్ ప్రభు నేనున్నాను అంటూ అనకు పిలిచి ఆఫర్లు ఇస్తున్నాడట. ఈ క్రమంలోనే అమ్మడు ఆమె నటించిన “ది వారియర్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతశెట్టి మాట్లాడుతూ ..” నా మాతృభాష ‘తుళు’.. అయితే తెలుగు బాగానే మాట్లాడతాను. దీనికి కారణం ఇంతవరకూ తెలుగు బాగా తెలిసిన దర్శకులతోనే చేశాను. అయితే లింగుసామిగారి తెలుగులో తమిళ యాస ఉంటుంది.
నాకు అసలు తమిళమే తెలియదు. అందువలన ఆయన మాట్లాడే తెలుగు అర్థం అయ్యేది కాదు. నేను ఆయన దర్శకత్వంలో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డానని.. తెలుగు డైరెక్టర్ ల తో నటించేటప్పుడు నాకు తెలుగు బాగా అలవాటైందని.. అయితే లింగుస్వామి తమిళ్ కూడా తెలుగు స్లాంగ్లో ఉంటుందని ..అది అర్థం చేసుకోలేక చాలా చాలా ఇబ్బంది పడ్డానని “చెప్పుకొచ్చింది . దీంతో సోషల్ మీడియాలో కృతిశెట్టి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. వీరిద్దరి కాంబోలో “ది వారియర్” అనే సినిమా వచ్చింది. అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది.