Moviesఅఫిషియల్ అనౌన్స్మెంట్ : బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా టైటిల్ వచ్చేసిందోచ్.. పండగ...

అఫిషియల్ అనౌన్స్మెంట్ : బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా టైటిల్ వచ్చేసిందోచ్.. పండగ చేసుకోండ్రా అబ్బాయిలు..!!

టాలీవుడ్ నట సింహం గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య.. తాజాగా నటిస్తున్న సినిమా ఎన్బికె 108. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేఅషన్స్ పెట్టుకుని ఉన్నారు నందమూరి అభిమానులు . ఇప్పటివరకు మాస్ చిత్రాల్లో నటించిన బాలయ్య ఫస్ట్ టైం ఈ సినిమాలో క్లాస్ అండ్ కూల్ పాత్ర చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

అంతేకాదు కామెడీ జోనర్ ని కూడా టచ్ చేయబోతున్నారట బాలయ్య . ఈ సినిమా కోసం అనిల్ రావిపుడి డిఫరెంట్ టైటిల్ ని చూస్ చేసుకున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి . “భగవత్ కేసరి” అనే టైటిల్ ని ఈ సినిమా కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. తెలంగాణ యాసలు ఈ సినిమాలో బాలయ్య మాట్లాడి మెప్పించబోతున్నారని ఇన్సైడ్ టాక్ వైరల్ గా మారింది . అంతేకాదు అలాగే ఇందులో ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ డ్రామా సినిమాకి హైలెట్ గా ఉండబోతుంది అంటూ కూడా వార్తలు వినిపించాయి .

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ భగవత్ కేసరి అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకనే ఇచ్చేసింది చిత్ర బృందం. సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నారు టీం. తాజాగా మైత్రి సంస్థ ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసును ఓపెన్ చేశారు . అక్కడ బాలయ్య స్టీల్ తో ఈ పోస్టర్ను పెట్టి ఆ పోస్టర్ మీద భగవత్ కేసరి అనే టైటిల్ కనిపించడంతో ఈ సినిమాకి అఫీషియల్ గా అదే టైటిల్ కన్ఫామ్ అయిపోయింది అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మైత్రి సంస్థ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు కాబట్టి ఇదే టైటిల్ ఫైనల్ అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ నటిస్తూ ఉండగా కూతురి పాత్రలు శ్రీలీల మెరవబోతుంది. ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news