Movies"గుంటూరు కారం" లో మరో స్టార్ హీరో.. గ్లింప్స్‌లో లీకైన క్రేజీ...

“గుంటూరు కారం” లో మరో స్టార్ హీరో.. గ్లింప్స్‌లో లీకైన క్రేజీ న్యూస్.. మీరు గ‌మ‌నించారా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని రీసెంట్ గానే కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేశారు . అంతే కాదు సినిమాకి సంబంధించిన ఓ గ్లింప్స్ ని కూడా ఓ వీడియో రూపంలో రిలీజ్ చేశారు . ఇప్పటి వరకు ఫుల్ క్లాస్ అండ్ కూల్ లుక్ లో మెప్పించిన మహేశ్ ..ఈ సినిమా మాస్ యాంగిల్ లో మెప్పించబోతున్నాడు అంటూ చిన్న క్లిప్ తోనే కన్ఫామ్ చేసేసాడు త్రివిక్రమ్ .

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లింప్స్ లో మహేష్ బాబు తో పాటు మరో స్టార్ హీరో కూడా ఉన్నాడు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎస్ రిలీజ్ అయిన గ్లింప్స్ లో మనం బాగా గమనించినట్లయితే మహేష్ బాబు ఓ సీన్లో తొడకొట్టినప్పుడు కార్ గాల్లోకి లేచే సీన్ ఉంటుంది .

మీ అందరికీ గుర్తుండే ఉంటుంది . ఆ టైంలో మహేష్ కుడివైపు జనాలతో పాటుగా చెవులు గట్టిగా మూసుకుని ఓ హీరో ఉంటాడు . ఆ హీరో ఎవరో కాదు.. స్టార్ హీరో జగపతిబాబు ..ఎస్ డౌట్ ఉంటే పైన ఉండే ఈ ఫోటోని మీరే పరిశీలించండి .

ఈ చిత్రంలో జగపతిబాబు కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నాడని ..విలన్ గా మెప్పించబోతున్నాడు అని త్రివిక్రమ్ ఫస్ట్ గ్లింప్స్ తోనే హింట్ ఇచ్చేశాడు అంటూ మహేష్ అభిమానులు ఈ ఫొటోస్ ని గ్లింప్స్ ని ట్రెండ్ చేస్తున్నారు . కాగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం రష్మిక మందనాన్ని చూస్ చేసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news