Moviesఒక్క ముద్దు కోసం అన్ని తిప్పలు పెట్టిందా..? పవిత్ర-నరేష్ లిప్ లాక్...

ఒక్క ముద్దు కోసం అన్ని తిప్పలు పెట్టిందా..? పవిత్ర-నరేష్ లిప్ లాక్ వెనుకల అంత కష్టం ఉందా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరో నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు చేసుకునే పవిత్ర లోకేష్ ల పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ జంట రీసెంట్ గా నటించిన సినిమా “మళ్లీ పెళ్లి”. భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన ఈ సినిమా నరేష్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన విషయం మనకి బాగా తెలిసిందే.

కాగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది . నరేష్ రియల్ లైఫ్ స్టోరీ కావడం.. అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే కావడం.. ఈ సినిమా డిజాస్టర్ కు మెయిన్ రీజన్ అంటూ చెప్పుకుంటున్నారు జనాలు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవిత్ర లోకేష్ – నరేష్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓపెన్ కామెంట్స్ చేశారు.

అంతే కాదు హోస్ట్ ఈ సినిమాలో లిప్ లాక్ పై ప్రశ్నించారు . ఈ క్రమంలోనే నరేష్ మాట్లాడుతూ ..”ఆ మొద్దు కోసం ఆవిడ మూడు నాలుగు గంటలు తిప్పలు పెట్టింది . డైరెక్టర్ వచ్చి మీరు ముద్దు పెట్టాలని అనగానే షాక్ అయిపోయింది ..మూడు నాలుగు గంటలు బ్రతిమిలాడుకొని.. అడుక్కున్న తర్వాత ..ఆ లిప్ లాక్ ఇచ్చింది” అంటూ నరేష్ అసలు విషయాన్నీ బయట పెట్టాడు. దీంతో ఒక ముద్దు కోసం నరేష్ ఇంత తిప్పలు పడ్డాడా..? అని జనాలు షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news