Moviesబాక్స్ ఆఫిస్ దుమ్ముదులిపేసిన ఆదిపురుష్ .. సెకండ్ డే టోటల్ ఎన్ని...

బాక్స్ ఆఫిస్ దుమ్ముదులిపేసిన ఆదిపురుష్ .. సెకండ్ డే టోటల్ ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రెబల్ హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా ఆది పురుష్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ హై రేంజ్ లో కలెక్ట్ చేసి సినీ ఇండస్ట్రీ రికార్డును తిరగరాసింది . మొదటి రోజు రూ.140 కోట్లు సాధించగా రెండో రోజు రూ.100 కోట్ల వరకు రాబట్టింది. రెండురోజుల్లో మొత్తంగా రూ.240 కోట్ల గ్రాస్ ను దక్కించుకుంది. వీకెండ్ కావడంతో కలెక్షన్లు బాగానే ఉన్నాయి.

కాగా రీసెంట్గా ఆది పురుష్ సెకండ్ కలెక్షన్స్ కూడా అఫీషియల్ గా ప్రకటించింది చిత్ర బృందం . ఈ క్రమంలోనే సెకండ్ డే ఆది పురుష్ బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ కలెక్షన్స్ రాబట్టింది . కాగా జూన్ 16న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 140 కోట్ల గ్రాస్ అందుకునింది. మొదటి రోజు భారీ నెగెటివిటీ ఎదుర్కోవడంతో మూవీ కలెక్షన్లపై ఎక్కువ ప్రభావం పడుతుందని అంతా అనుకున్నారు.

సీన్ కట్ చేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మలిచారు . ఫస్ట్ డే 140 కోట్లు రాబట్టిన ఈ చిత్రం..సెకండ్ డే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది . రెండు రోజులు పూర్తయ్యేపాటికి ఈ సినిమా 240 కోట్ల అందుకొని సంచలన రికార్డులను సృష్టించింది . అంతేకాదు మొదటి వీకెండ్ ముగిసే సమయానికి ఈ సినిమా 350 కోట్లు కూడా దాటేస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మూవీపై కూడా కొంచెం పాజిటివ్ టాక్ బయటకు వస్తుంది . చూడాలి మరి ప్రభాస్ ఆది పురుష్ ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో..?

అయితే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.271 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కావాలంటే రూ.272 కోట్ల వరకు షేరే వసూల్ చేయాల్సి ఉంటుంది.

కొన్ని లెక్కల ప్రకారం రెండో రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..

ఏపీ మరియు నైజాం : రూ.75 కోట్లు
తమిళనాడు : రూ.2.20 కోట్లు
కేరళ : రూ.1.10 కోట్లు
కర్ణాటక : 14.32 కోట్లు
ఋఓఈ : క్ప్.90 కోట్లు
ఓవర్సీస్ : రూ.38 కోట్లు / 4.63 మిలియన్ డాలర్స్ గా వసూళ్లు రాబట్టినట్టు అంచనా వేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news