Newsబాల‌య్య కోసం స్కెచ్ వేసిన ఇద్ద‌రు కుర్ర డైరెక్ట‌ర్లు… ఆ హిట్...

బాల‌య్య కోసం స్కెచ్ వేసిన ఇద్ద‌రు కుర్ర డైరెక్ట‌ర్లు… ఆ హిట్ డైరెక్ట‌ర్లు వీళ్లే…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ వరుసగా సినిమాలు చేసుకుంటూ సూపర్ హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు. అఖండ – వీర సింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్లు కొట్టి మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 108వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య కోసం వరుసగా క్రేజీ డైరెక్టర్లు లైన్లో ఉన్నారు. ఇప్పటికే బోయపాటి శ్రీను అఖండకు సీక్వెల్ గా అఖండ 2 ఉంటుందని ప్రకటించారు

అలాగే పూరి జ‌గ‌న్నాథ్ తో పాటు మ‌రి కొంద‌రు డైరెక్ట‌ర్లు కూడా బాల‌య్య‌తో సినిమా చేయాల‌ని కాచుకుని ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ లిస్టులోకి మ‌రో ఇద్ద‌రు కుర్ర డైరెక్ట‌ర్లు కూడా వ‌చ్చి చేరారు. ఆ ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు కూడా రీసెంట్‌గా హిట్లు త‌మ ఖాతాలో వేసుకుని సంచ‌ల‌నం క్రియేట్ చేసిన వారు కావ‌డం విశేషం. తాజాగా బ‌ల‌గం అనే చిన్న సినిమాతో పెద్ద హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు క‌మెడియ‌న్ వేణు.

బ‌ల‌గం సినిమాతో బ‌ల‌గం వేణు అయిపోయాడు. ఈ సినిమా నిజంగానే చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఎంతో పెద్ద సంచ‌ల‌నం క్రియేట్ చేసింది. ప‌లు అంత‌ర్జాతీయ అవార్డులు సాధించిన ఈ సినిమా చూశాక మెగాస్టార్ చిరంజీవితో పాటు ఎంతో మంది హీరోలు వేణు ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ సినిమాతో హిట్ కొట్టిన వేణు ఇప్పుడు త‌న నెక్ట్స్ సినిమాపై కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నాడు.

త‌న‌కు ద‌ర్శ‌కుడిగా ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజు బ్యాన‌ర్లోనే వేణు నెక్ట్స్ సినిమా ఉండ‌నుంది. అయితే ఈ సారి వేణు ఏకంగా న‌ట‌సింహం బాల‌కృష్ణ‌తో ఓ యాక్ష‌న్ , ఎమోష‌న‌ల్ మిక్సింగ్ అయిన క‌థ‌తో సినిమా చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అదే నిజం అయితే బ‌ల‌గం వేణుకు బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్కిన‌ట్టే. ఇక రీసెంట్‌గా విరూపాక్ష సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు కొత్త డైరెక్ట‌ర్ కార్తీక్ దండు.

కార్తీక్ కూడా బాల‌య్య కోసం ఓ అదిరిపోయే స్క్రిఫ్ట్ రెడీ చేసుకుని.. ఇప్ప‌టికే ఓ సారి వినిపించాడ‌ని అంటున్నారు. కార్తీక్ చెప్పిన లైన్ బాల‌య్య‌కు బాగా న‌చ్చింద‌ని.. క‌థలో కొన్ని మార్పులు చేసేప‌నిలో కార్తీక్ ఉన్నాడ‌ని.. ఈ ప్రాజెక్ట్ కూడా సెట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయ‌ని అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news