Newsఅద్గది..నందమూరి బ్లడ్ అంటే ఇదే.. అందుకే నువ్వు నట సింహం బాసూ.....

అద్గది..నందమూరి బ్లడ్ అంటే ఇదే.. అందుకే నువ్వు నట సింహం బాసూ.. శభాస్ బాలయ్య..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పేరుకి సీనియర్ హీరో అయిన ఏమాత్రం తన ఎనర్జీ లెవల్స్ ని తగ్గించకుండా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలను ఓకే చేస్తూ.. సినిమాలో సరికొత్త కంటెంట్ ని ప్రదర్శిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు బాలయ్య . ఈ క్రమంలోనే టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో బాలయ్య నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు అని మరోసారి ప్రూవ్ అయ్యింది.

రీసెంట్గా బలగం సినిమాతో సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న వేణుకి పిలిచి మరి ఆఫర్ ఇచ్చాడు నందమూరి బాలయ్య అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో కమెడియన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వేణు రీసెంట్గా బలగం అనే సినిమాను తెరకెక్కించాడు . ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పెట్టిన దానికి పది రెట్లు లాభాలు తీసుకొచ్చి ..నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది ఈ సినిమా.

ఈ క్రమంలోనే వేణు లో ఉన్న టాలెంట్ ని చూసిన బాలయ్య అతగాడిని ఎంకరేజ్ చేయడానికి ఏకంగా పిలిచి మరి ఆఫర్ ఇచ్చారట . ” మంచి కథను రెడీ చేసుకుని త్వరలోనే రా.. సినిమా తీద్దాం ” అంటూ ఇంటికి పిలిచి సత్కరించి మరీ ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చాడట . ఏ మాటక ఆ మాట ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు .. పిలిచి సత్కరించే వాళ్ళు ఉన్నారు.. కానీ ఇలా పిలిచి అవకాశం ఇచ్చే హీరో మాత్రం నందమూరి బాలయ్యే. అది ఆయన బ్లడ్ లోనే ఉంది . ఒకప్పుడు నందమూరి తారకరామారావు గారు కూడా ఇలాగే టాలెంట్ ఉన్న స్టార్స్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. దీంతో శభాష్ బాలయ్య అంటూ నందమూరి ఫ్యాన్స్ సరికొత్త హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news