టాలీవుడ్ లోనే క్రేజీ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య – సమంత పెళ్లయ్యాక సరిగా నాలుగేళ్లు కూడా కాపురం చేయలేదు.. అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. 2021 చివరలో సరిగ్గా తమ పెళ్లిరోజుకి పది రోజుల ముందుగా సమంత – నాగచైతన్య ఇద్దరు తాము విడిపోతున్నట్టు సంయుక్తంగా ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఎన్ని వార్తలు బయటకు వచ్చినా వీరు విడిపోవడానికి అసలు కారణం ?ఏంటన్నది బయటకు రాలేదు.
నాగచైతన్య.. సమంతని మీడియా వాళ్ళు విడాకులకు కారణం ఏంటని ? ఎన్నోసార్లు అడిగినా సరైన సమాధానం ఇవ్వలేదు. విడాకులపై నాగచైతన్య ఒకలా స్పందిస్తుంటే.. సమంత మాత్రం కాస్త ఘాటుగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. విడాకుల తర్వాత నాగచైతన్య చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాడని చెప్పాలి. ఏనాడు ఎవరిపై కామెంట్ చేసేందుకు ఇష్టపడలేదు. సమంత ప్రస్తావన వచ్చినా చాలా సున్నితంగా సమాధానాలు చెప్పేవాడు.
ఎవరి మనసులు నొప్పించేందుకు చైతు ఇష్టపడేవాడు కాదు. అయితే సమంత మాత్రం ఎప్పటికప్పుడు చైతు పేరు వినిపించినా… విడాకుల గురించి ప్రస్తావన వచ్చినా రుసరుసలాడుతూ ఉంటుంది. కోపంగా సమాధానాలు చెబుతూ ఉంటుంది. ఓ సందర్భంలో తాము ఇద్దరం ఒకే రూమ్ లో ఉండాల్సి వస్తే పక్కన కత్తులు, కటార్లు ఉంటే ఏం జరుగుతుందో ? తెలియదు అన్నట్టుగా మాట్లాడింది.
ఇక తాజాగా నాగచైతన్య కస్టడీ సినిమా ప్రమోషన్లు, ఇంటర్వ్యూలలో బిజీబిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్లు అలా ప్రారంభమయ్యాయో లేదో ? వెంటనే టార్చర్ టైం స్టార్ట్ అంటూ కవ్వించేలా మాట్లాడుతోంది. పైగా ఇటీవల సమంత నటించిన శాకుంతలం సినిమా కథాబలం లేకుండా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా పరాజయం వెనక కూడా చైతుతో పాటు అక్కినేని అభిమానులు ఉన్నారని.. సమంత అభిమానులు ప్రచారం చేయడం నిజంగా బాధాకరం.
కథలో దమ్ము లేకుండా ఏ సినిమా అయినా ఆడదు పైగా శాకుంతలం సినిమా కోసం సమంత ఎన్నో సింపతి ఆటలు ఆడినా అవేవీ వర్కౌట్ కాలేదు. సమంత తీవ్రమైన ప్రస్టేషన్లోనే చైతును ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ టార్చర్ పెడుతుందని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతున్నాయి తాజాగా ఆమె కస్టడీ సినిమాను టార్గెట్ చేస్తూ పరోక్షంగా సెటైర్లు వేస్తోంది అన్న చర్చలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సమంత ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు.