Moviesఒక బాల‌య్య న‌లుగురు హీరోయిన్ల‌తో ప్రేమాయ‌ణాలు... ఆ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా..!

ఒక బాల‌య్య న‌లుగురు హీరోయిన్ల‌తో ప్రేమాయ‌ణాలు… ఆ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో 100కు పైగా సినిమాలు చేసి ఇప్పటికీ అదే జోష్‌తో దూసుకుపోతున్నారు. బాలయ్య నైజం గురించి అందరికీ తెలిసిందే. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అని అందరూ చెబుతారు. బాలయ్య పైకి గంభీరంగా కోపంగా ఉన్నట్టు కనిపించినా ఆయన మనసు వెన్న. బాలయ్య తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో ఎన్నో సినిమాలలో నటించారు. అయితే కొందరు హీరోయిన్ల విషయంలో ఆయనపై గాసిప్‌లు వచ్చాయి.

బాలయ్య మహిళలను, హీరోయిన్లను ఎంతో గౌరవిస్తారు. అది సెట్లో అయినా.. బయట అయినా అయితే ఓ నలుగురు హీరోయిన్లతో ఆయన ప్రేమాయణాలు నడిపినట్టు పుకార్లు, షికార్లు చేశాయి. బాలయ్య కెరీర్ ప్రారంభంలో చెన్నైలో ఉన్నప్పుడు కోలీవుడ్ సీనియర్ నటి కుష్బూతో ప్రేమలో పడ్డాడని అంటారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా బాలయ్య అనుకున్నాడని అయితే ఎన్టీఆర్‌కు, హరికృష్ణకు ఇష్టం లేకపోవడంతో బాలయ్యకు అప్పటికప్పుడు ఆగమేఘాల మీద వసుంధరతో పెళ్లి చేసేసారని అంటారు.

ఎన్టీఆర్‌కు తన కుమారుడికి సినిమా హీరోయిన్ భార్య‌గా రావడం ఇష్టం లేదట. ఆ తర్వాత సుహాసినితో వరుసగా హిట్ సినిమాలు పడినప్పుడు వారిద్దరు ప్రేమించుకున్నారని పుకార్లు మాత్రం వచ్చాయి. అయితే వీరిద్దరూ స్నేహంగా ఉండే వారే తప్ప వీరిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ, దోమ లేదు. ఆ తర్వాత విజయశాంతితో వరుసగా సినిమాలు చేశాడు. బాలయ్య వీరిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలే వచ్చాయి.

ఆ సమయంలో విజయశాంతి బాలయ్య ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు అన్న టాక్ తెలుగు నాట గట్టిగా వినిపించింది. పైగా బాలయ్య స్వయంగా విజయశాంతిని తన పక్కన హీరోయిన్గా పెట్టాలని నిర్మాతలకు, దర్శకులకు కండిషన్లు కూడా పెట్టే వారన్న టాక్‌ అప్పట్లో బయటికి వచ్చింది. ఆ తర్వాత సిమ్రాన్‌తో బాలయ్య నాలుగు సినిమాల్లో నటించారు.

పైగా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు కూడా వారిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. అప్పట్లో వారిద్దరి మధ్య కూడా సంథింగ్ సంథింగ్ నడిచింది అన్న గుసగుసలు అయితే బయటకు వచ్చాయి. అలా ఈ నలుగురు హీరోయిన్ల విషయంలో బాలయ్య రూమర్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. వాస్తవం ఏంటన్నది ? పక్కన పెడితే హీరోయిన్లకు బాలయ్య చాలా చాలా గౌరవం ఇస్తారు అన్నది అందరికీ తెలిసిన విషయమే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news