యస్ ప్రసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో సినిమా రంగంలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దర్శకధీరుడుగా పేరు సంపాదించుకున్న రాజమౌళి కూడా హీరోయిన్స్ ని పిండేస్తాడా ..? అంటే అవునానే అంటున్నారు సినీ ప్రముఖులు ..సినీ విశ్లేషకులు . అయితే మీరు అనుకున్న పిండడం కాదండోయ్ .. ఈ పిండడం వేరే.. జనరల్ గా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని కొందరు డైరెక్టర్లు ఎలా పిండేస్తారో మనకు తెలిసిందే . కానీ వాళ్ళందరిలోకి ప్రత్యేకం రాజమౌళి .
హీరోయిన్స్ ని రాజమౌళి కూడా పిండేస్తాడు .. వర్క్ పరంగా సినిమాలో తన మూవీకి ఏ హీరోయిన్ అయినా ఒప్పుకుంటే చాలు ఇక అప్పటినుంచి ఆ హీరోయిన్ పగలు రాత్రి రాజమౌళి చేత టార్చర్ కి గురి అవ్వాల్సిందే. అంతలా వర్క్ పరంగా పిండి పిండి నలిపి చేసి పడేస్తాడు రాజమౌళి అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కేవలం హీరోయిన్స్ నే కాదు హీరోలను కూడా అలాగే ట్రీట్ చేస్తూ ఉంటాడు మన జక్కన్న.
అనుకున్నది సాధించే వరకు నిద్రపోని రాజమౌళి కంటెంట్ విషయంలో కథ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు . అంతేకాదు తన అనుకున్న సీన్స్ కి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ అలా వచ్చేవరకు హీరోయిన్స్ ని తెగ నలిపేస్తాడు పిండేస్తాడు అంటూ వార్తలు వినిపించేవి. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ ఇదే విషయాన్ని ఒప్పుకున్నారు చరణ్-తారక్. నాటు నాటు పాటకు ఎన్నిసార్లు మా దగ్గర ప్రాక్టీస్ చేయించారో తెలీదు.. టేకుల మీద టేకులు తీయించుకున్నాడు.
కానీ ఆఖరికి సెలెక్ట్ చేసింది రెండవసారి చేసిన స్టెప్స్ నే.. అంత పిచ్చోడు రాజమౌళి అంటూ సరదాగా చెప్పుకొచ్చారు . అంతేకాదు హీరోయిన్ ని కూడా బాడీ ఫిజిక్ విషయంలో కాస్ట్యూమ్ విషయంలో పదేపదే నస పెట్టి మరి చంపేస్తూ ఉంటాడట . మగధీర సినిమా టైంలో కాజల్ ని రాత్రి పగలు చుక్కలు చూపించాడట రాజమౌళి . అందుకే ఆ సినిమా అంత హిట్ అయింది . ఏది ఏమైనా సరే రాజమౌళి లాంటి దర్శకుడు ఇండస్ట్రీలో చాలా రేర్ గా ఉంటారు అన్నది మాత్రం వాస్తవం..!!