సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు, స్టార్ హీరోలు వేసే సోషల్ మీడియా ట్వీట్స్ కు మంచి విశ్వసనీయత ఉంటుంది. వాళ్ళు చెప్పే మాటలకు, చేసే ట్వీట్స్‌కు తిరుగే లేని ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా స్టార్ హీరోలపై అలాగే ఉంటుంది. అందుకే తమ సోషల్ మీడియా ఖాతాలను చాలా జాగ్రత్తగా ఆచితూచి మరి వాడుతూ ఉంటారు. హీరోలు ఉదాహరణకు రాజమౌళి చేసే కామెంట్లు చిన్న సినిమాలకు పెద్ద బూస్టింగ్ గా ఉపయోగపడుతూ ఉంటాయి. రాజమౌళి ఒక సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడితే అది.. ఆ సినిమాకు చాలావరకు హెల్ప్ అవుతుంది
ఇక స్టార్ సెలబ్రిటీలు ప్రతి సందేశాన్ని తాము సొంతంగా టైప్ చేసి పోస్ట్ చేయరు. ఏజెన్సీలకు లేదా పి.ఆర్ టీంలకు ఈ బాధ్యతను అప్పగిస్తారు. అయితే వారిని గుడ్డిగా నమ్మితే ప్రమాదం. ఒక్కోసారి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మహేష్ బాబు సోషల్ మీడియా ఖాతాలకు, ఆ సందేశాలకు ఇప్పటివరకు ఓ విశ్వాసనీయత ఉండేది. అయితే తాజాగా మేమ్ ఫేమస్ అనే సినిమా తోపు అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఆ సినిమా ఫలితం దానికి పూర్తిగా రివర్స్‌లో ఉంది.
దీంతో మహేష్ సోషల్ మీడియా మెసేజ్ లు ఇంత చీఫ్‌గా ఉంటాయా ? అసలు మహేష్ టేస్ట్ ఎంత దారుణంగా ఉంటుందా ? అన్న విమర్శలు స్టార్ట్ అయ్యాయి. మేమ్ ఫేమస్ సినిమాకు మహేష్ ఇచ్చిన ఎలివేషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. తాను సినిమా చూశానని.. చాలా అద్భుతం అని చెప్పుకొచ్చాడు. అక్కడితో ఆగకుండా తన సొంత బ్యానర్‌పై ఈ సినిమా దర్శకుడు కం హీరోతో సినిమా చేస్తానని అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు.
తీరా నిన్న సినిమా రిజల్ట్ చూశాక జనాలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. అసలు నిజంగానే మహేష్ ఈ సినిమా చూశాడా ? మహేష్ కు ఈ సినిమాలో ఏ పార్ట్ వచ్చిందో అర్థం కావడం లేదు.. కాస్త చెబితే అర్థం చేసుకుంటాం అంటూ మహేష్‌ను యాడ్ చేస్తున్నారు. అయితే వాస్తవంగా వినపడుతున్న టాక్ ప్రకారం మహేష్ ఈ సినిమా చూసి ఉండడని.. ఒకవేళ చూస్తే ఆ ట్వీట్ వేయవద్దని కచ్చితంగా తన టీంకు చెప్పి ఉండేవాడని… కేవలం తన పీఆర్ టీంను గుడ్డిగా నమ్మి ఈ చాయ్ బిస్కెట్ వాళ్లకు కాస్త సాయం చేసేందుకే ఇలా చేసి ఉంటాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మహేష్ ఇలా చేస్తే తన ట్వీట్లకు విశ్వసనీయత ఉండదని అంటున్నారు. అయితే ఈ ప్రమోషన్ మాత్రం మేమ్ ఫేమస్ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. ఎలాంటి స్టార్ కాస్ట్ లేని ఈ సినిమాకు మొదటిరోజు కోటికి పైగా గ్రాస్ వచ్చింది. వాళ్లు పిచ్చ హ్యాపీ..!