Moviesతారక్ కి ఆమె అంటే అంత పిచ్చా..? అడిగి మరి సినిమాలో...

తారక్ కి ఆమె అంటే అంత పిచ్చా..? అడిగి మరి సినిమాలో అవకాశం ఇచ్చాడే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి ఆస్కార్ అవార్డు అందుకున్నప్పటినుంచి ఎన్టీఆర్ పేరు గ్లోబల్ స్థాయిలో మారుమ్రోగిపోతుంది . ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ చేస్తున్నారు అభిమానులు . ప్రజెంట్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ 30 అనే సినిమాలో నటిస్తున్నాడు .

ఈ సినిమా అయిపోగానే ప్రశాంత నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 అనే సినిమాకి సైన్ చేశాడు . బ్యాక్ టు బ్యాక్ ఇలా పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా మారిపోయిన తారక్ కి సంబంధించిన ఓ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది . తారక్ ఎంతోమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.. కానీ అందరికన్నా నచ్చిన హీరోయిన్ మాత్రం నిత్యామీనన్ ని అంటూ చెప్పుకొస్తున్నాడు . ఇప్పటివరకు తారక్ నటించిన హీరోయిన్స్ అందరిలో తన ఫేవరెట్ ఎవరు అంటే నిత్యామీనన్ అంటూ క్లారిటీ ఇచ్చాడు.

అంతేకాదు జనతా గ్యారేజ్ సినిమాలో నిత్యామీనన్ పాత్ర కోసం కొరటాల శివ ఎంతోమంది హీరోయిన్స్ ను అప్రోచ్ అయ్యారట. కానీ ఎన్టీఆర్ కోరిక మేరకు ఆ పాత్రకు నిత్యామీనన్ అయితేనే బాగుంటుంది అంటూ ఏరి కోరి అడిగిమరీ ఆ సినిమాలో ఆ పాత్ర కోసం నిత్యామీనన్ ను సెలెక్ట్ చేసుకున్నారట . ఇది తెలిసిన నిత్యామీనన్ కూడా షాక్ అయిపోయిందట . అందుకే కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసి మరి తారక్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఎంతటి హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ నిత్యామీనన్ తో నటించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారట . అయితే నిత్యామీనన్ సరైన పాత్రలు రాక తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంది అంటూ తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news