Moviesరెండో రోజూ త్రివిక్ర‌మ్‌పై దాడి ఆపని బండ్ల.. అస‌లు గొడ‌వ‌కు కార‌ణం...

రెండో రోజూ త్రివిక్ర‌మ్‌పై దాడి ఆపని బండ్ల.. అస‌లు గొడ‌వ‌కు కార‌ణం ఇదే…!

టాలీవుడ్ లో మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మధ్య మొత్తానికి ఏదో తేడా కొడుతోంది. నిన్న బండ్ల గణేష్ గురూజీ అంటూ పరోక్షంగా త్రివిక్రమ్ మీద కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు. సోషల్ మీడియాలో చేసిన ఈ కామెంట్లు చూస్తే ఈ త్రివిక్రమ్‌ను టార్గెట్గా చేసుకొని చేసినవే అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. తాజాగా ఈరోజు బండ్ల గణేష్ గురూజీ పేరుతో త్రివిక్రమ్‌ను చాకిరేవు పెట్టేశారు.

భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి.. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి అని కామెంట్ చేశాడు. అలాగే సాగినంత కాలం నా అంత వాడు లేడంటారు.. సాగకపోతే ఊరక చతికిల‌ పడిపోతారు.. చెప్పటమే నా ధర్మం వినకపోతే నీ కర్మం ఎలా కొన్ని ట్వీట్లు వేశాడు బండ్ల గణేష్. దీనిపై సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.

భగవంతుడు అంటే పవన్ కళ్యాణ్ అని.. భక్తుడు అంటే బండ్ల గణేష్ అని ఎవరికి వారు చర్చించుకుంటున్నారు. అసలు పవన్ కు బండ్ల గణేష్ కు మధ్య గ్యాప్ రావడానికి త్రివిక్రమ్‌ కారణమని చర్చ‌ నడుస్తోంది. పవన్‌తో బండ్ల గణేష్ సినిమా చేయకుండా త్రివిక్రమే అడ్డుకుంటున్నాడు అన్న కోపంతో బండ్ల ఈ తరహా కామెంట్లు చేస్తున్నాడు అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

నిన్నటి కి నిన్న కూడా బండ్ల గణేష్ గురూజీ పై కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. ఇక గురూజీకి కాస్ట్‌లీ గిఫ్టులు పిచ్చి కూడా ఉందని.. బండ్ల గణేష్ నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇలా ఈరోజు అగరబత్తి కాన్సెప్ట్ తో తెరపైకి వచ్చాడు. ఈ యుద్ధం చూస్తుంటే తనకు ఏదో ఒక సమాధానం దొరికే వరకు బండ్ల ఆగేలా లేడు. ఇలాంటి వాటిపై త్రివిక్రమ్ స్పందించడు.. మరి పవన్ అయినా తన భక్తుడి ప్రశ్నలకు స్పందిస్తాడా ? లేదా అన్నది చెప్పలేం.

అయితే ఇప్పటిలో పవన్ చాలా బిజీగా ఉన్నాడు. బండ్ల గణేష్ తో సినిమా చేయాలి అంటే మరో రెండు మూడేళ్ల వరకు కుదిరి ఛాన్స్ లేదు. ఇక త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ సినిమాలను శాసిస్తున్నాడని.. త్రివిక్రమ్ ఆశీస్సులు ఉన్న ఓజీ – బ్రో సినిమాల షూటింగులు శరవేగంగా నడుస్తున్నాయని త్రివిక్రమ్ ఆశీస్సులు లేని హరిహర వీరమల్లు – ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగులు ఎప్పుడు ? పూర్తి అవుతాయో కూడా తెలియదు అని ఇండ‌స్ట్రీ ఊగిపోతోంది.

మధ్యలో భారీగా కమిషన్ తీసుకుని త్రివిక్రమ్ పవన్ సినిమాలను సెట్ చేస్తున్నాడు అన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. అందుకనే బండ్ల తన ఆగ్రహాన్ని ఇలా గురూజీ పై వ్యక్తం చేశాడని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news