ఎస్ ..ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో.. బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది . బాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది క్యూట్ ..సెక్సీ కపుల్ గా పేరుగా పేరు సంపాదించుకున్న కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సైతం చాలా రొమాంటిక్‌గా.. సెలబ్రేట్ చేసుకున్నారు .
కాగా పెళ్లి అయ్యి సంవత్సరం కావస్తున్నా ఇంకా ఈ జంట గుడ్ న్యూస్ చెప్పలేదా ..?ఏంటి ..? అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు . కత్రినా తల్లి అయితే చూడాలన్నది బాలీవుడ్ లో ఉండే స్టార్ ప్రముఖుల కోరిక కూడా.. అయితే కత్రినా ఇంకా అలాంటి గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధంగా లేదట . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆరాకొరా ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నా.. అనంత ఫేక్ అంటూ తేల్చేస్తున్నారు కుటుంబ సభ్యులు . ఈ క్రమంలోనే కత్రినా విక్కీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.
జనరల్‌గా భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. గొడవలు గిలి కజ్జాలు ఉంటేనే ఆ బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది . అయితే కత్రినా కూడా అందరి అమ్మాయిల్లాగే భర్త మీద కోప్పడి అలుగుతుందట ..ఈ క్రమంలోనే భార్యను కూల్ చేయడానికి భార్యను టెంప్ట్ చేయడానికి విక్కీ ఓ బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడట. అదే కత్రినా కి ఇష్టమైన “జామున్ “. కత్రినా కి గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టమట . డైట్ లో ఉన్నా సరే ఏమాత్రం మిస్ అవ్వకుండా టేస్ట్ చేస్తుంది అట .
ఈ క్రమంలోనే కత్రినా విక్కిమధ్య గొడవ జరిగినా.. లేదు ఏదైనా కత్రినా బాధలో ఉన్నా.. వెంటనే విక్కీ ఆమెను కూల్ చేయడానికి గులాబ్ జామున్ చేసి పెడతారట. అంతేకాదు ఈ జంట తీరిక దొరికినా.. గంట టైం దొరికిన సరే టీవీలో కామెడీ సినిమాలను పెట్టుకొని చూసి ఎంజాయ్ చేస్తారట . యూట్యూబ్‌లో పలు ఫన్నీ వీడియోలను పెట్టుకొని మీమ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారట . అలా వీళ్ళ తమ సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు . ఏది ఏమైనా ఈ జంట క్రేజీ కపుల్ అని అంటున్నారు బాలీవుడ్ జనాలు..!!