టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు . కాగా ఆయన పుట్టినరోజుకి ముందే అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చింది ఆయన నెక్స్ట్ చేసే సినిమా టీం. మనకు తెలిసిందే గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న తారక్..ప్రెసెంట్ ఎన్టీఆర్ థర్టీ సినిమాలో నటిస్తున్నాడు . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన కీలక సీన్స్ కంప్లీట్ చేస్తున్నారు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ కోసం గోవా వెళ్లబోతున్నారు ఎన్టీఆర్ 30 టీం.
కాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిన్న సాయంత్రం ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని..న్యూ లుక్ అండ్ టైటిల్ ని అనౌన్స్ చేశారు . మొదటినుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారమే సినిమాకి “దేవర” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు . అంతేకాదు ఈ మాస్ లుక్ లో తారక్ చాలా గంభీరంగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ అదిరే లుక్‌లో కనిపించారు. సముద్రపు ఒడ్డున ఎగసిపడే కెరటాల్లో క్రూరంగా కనిపిస్తున్నాడు. చేతిలో చివర రక్తంతో ఉన్న బల్లెం పట్టుకుని… విలన్ల కోసం వెంటాడే మగధీరుడిలా ఉన్నాడు. లుక్ అయితే చాలా పవర్ ఫుల్‌గా ఉంది.
దీంతో ఈ పోస్టర్ను తెగ ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో “దేవర” సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి దేవరా అనే టైటిల్ ని పెట్టింది ఎవరో కాదు ఎన్టీఆర్ పెద్దకొడుకు అభయ్ రామ్. ఎస్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ మూడు పేర్లను అబ్బాయికి చెప్పి మూడింట్లో ఒకటిని సెలెక్ట్ చేయమన్నారు . అందురూ ఊహించిన విధంగా “దేవర” అనే టైటిల్ను ఫిక్స్ చేశారట అభయ్. దీంతో లక్ష్మీ ప్రణతి కూడా అదే బాగుంది అని చెప్పడంతో ఫైనల్ గా ఎన్టీఆర్ దేవర అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట . దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. నాన్న సినిమాకి కొడుకు టైటిల్ పెట్టడం.. ఇదే ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇంతకన్నా లక్కీ ఛాన్స్.. అదృష్టమేమి ఉంటుంది చెప్పండి అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ బర్త డే అంటూ ట్రెండ్ చేస్తున్నారు..!!