Moviesఊర నాటు మాస్ లుక్ లో ఎన్టీఆర్.. "దేవర" దెబ్బకు ఇండస్ట్రీ...

ఊర నాటు మాస్ లుక్ లో ఎన్టీఆర్.. “దేవర” దెబ్బకు ఇండస్ట్రీ దడదడలాడిపోవాల్సిందే..ఇరగదీసేసాడు..!!

వావ్ .. ఇది నిజంగా నందమూరి అభిమానులకు కేక పెట్టించే న్యూస్ అనే చెప్పాలి. కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది . అభిమానుల అంచనాలకు డబల్ కాదు ట్రిపుల్ రేంజ్ లో కొరటాల ఇచ్చిన ఈ మాసివ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదటి నుంచి నందమూరి అభిమానులు ఆయనని ఎలాంటి లుక్ లో చూడాలి అనుకున్నారో.. అందుకు ఏమాత్రం తీసిపో రేంజ్ లో కొరటాల శివ ఎన్టీఆర్ థర్టీలో నందమూరి తారక్ ను చూపించబోతున్నారు అని పోస్టర్ తోనే తెలిసిపోయింది . మరీ ముఖ్యంగా ఇప్పటివరకు మనం కనీ విని ఎరుగని రేంజ్ లో తారక్ లుక్ ఉండటం విశేషం.

ఎస్ కొరటాల శివ అనుకునే పనే చేశారు . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన పేరుని అఫీషియల్ గా ఎన్టీఆర్ థర్టీ సినిమాకు పెట్టుకొచ్చారు. ఇంతకీ ఆ పేరు ఏంటి అనుకుంటున్నారా ..? “దేవర”..యస్ పలుకుతుంటేనే అదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది. చాలా గంభీరంగా బోల్డ్ గా కనిపించే లుక్ లో నందమూరి తారక్ పిక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది.

మరీ ముఖ్యంగా సముద్రపు తీరాన .. రాళ్ల మధ్యలో నిల్చోని చేతిలో ఆయుధం పట్టుకున్న ఎన్టీఆర్ పిక్ చూడడానికి చాలా బోల్డ్ గా అట్రాక్టివ్ గా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమాతో ఎన్టీఆర్ తన పేరుని గ్లోబల్ స్థాయిలో మారోసారి మారుమ్రోగిపోయేలా చేసుకోవడం కన్ఫామ్ అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు . మరీ ముఖ్యంగా బ్లాక్ షర్ట్ బ్లాక్ పంచలో పైన తువాల్ వేసుకొని చాలా మాస్ మాస్ లుక్ లో కనిపించారు . ఏది ఏమైనా సరే ఇలాంటి ఓ సరికొత్త లుక్ లో నందమూరి తారక్ ని చూడడం నిజంగా అభిమానులకు గూస్ బంప్స్ తెపిస్తుంది . ఫైనల్లీ నందమూరి తారక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమాకి “దేవర” అనే టైటిల్ను ఫిక్స్ చేసేసాడు కొరటాల శివ . చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి క్రేజీ రికార్డ్స్ నెలకొల్పబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news