Moviesశ్రీలీల ఇంత అందంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా..? లెటేస్ట్ పిక్స్...

శ్రీలీల ఇంత అందంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా..? లెటేస్ట్ పిక్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పుడు అందరు స్టార్ హీరోలకి శ్రీలీల కావాల్సి వస్తుంది. టాలీవుడ్ లో అప్పుడే అడుగుపెట్టిన హీరో దగ్గర నుంచి టాప్ మోస్ట్ సీనియర్ హీరోల వరకు అందరూ శ్రీలీల జపమే చేస్తున్నారు . దీనంతటికి కారణం ఆమె అందం ..ఆ తర్వాత ఆమె నటన.. ఆ తర్వాత డ్యాన్స్.

ఎలాంటి పాత్రలోనైనా సరే అవలీలగా నటించే సత్తా ఉన్న శ్రీలీల చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే శ్రీలీల ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటా అంటూ సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. రీసెంట్గా ఆమె యోగ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే శ్రీలీల అందానికి అసలు సీక్రెట్ యోగానే అని చెప్పుతున్నారు జనాలు.

అమ్మడు క్రమం తప్పకుండా యోగ చేస్తుంది అని..అందుకే అంత అందం గా ఉందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు శ్రీ లీల డైటింగ్ అంటూ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టుకోదని.. హెల్తీ ఫుడ్ కడుపునిండా తింటుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు . దీంతో శ్రీ లీల ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక శ్రీలీల కెరీర్‌ పరంగా చూస్తే ఆమె టాలీవుడ్‌లోనే అత్యంత బిజీ యాక్ట్రెస్‌గా రాణిస్తుంది. స్టార్‌ హీరోల నుంచి యంగ్‌ స్టర్స్ వరకు అందరితోనూ కలిసి నటిస్తుంది. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news