Moviesబ్రేకింగ్‌: రోడ్డు ప్ర‌మాదంలో శ‌ర్వానంద్‌కు తీవ్ర గాయాలు.. కొద్ది రోజుల్లోనే పెళ్లి......

బ్రేకింగ్‌: రోడ్డు ప్ర‌మాదంలో శ‌ర్వానంద్‌కు తీవ్ర గాయాలు.. కొద్ది రోజుల్లోనే పెళ్లి… ఆవేద‌న‌లో కుటుంబం

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో వరుసగా ఏదో ఒక ఇబ్బందికర వార్త ఎదురవుతూనే ఉంది. నిన్న రాత్రి హైదరాబాదులో జరిగిన ఈ ప్రమాదంలో శర్వానంద్ బాగా గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న శర్వానంద్ ఇటీవల తన ప్రియురాలు రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కొద్ది రోజుల్లోనే వీరిద్దరి వివాహం రాజస్థాన్లో అంగరంగ వైభవంగా జరగనుంది.

పెళ్లి కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ టైంలో శర్వానంద్‌కు రోడ్డు ప్రమాదం జరిగి గాయాలపాలవడంతో టాలీవుడ్ అంతా ఆందోళనతో ఉంది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు శర్వానంద్ కు ఏం ?జరిగింది అంటూ ఆరా తీస్తున్నారు. శర్వానంద్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. నిన్న రాత్రి శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిలింనగర్ జంక్షన్ దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. గాయాలతో ఉన్న శర్వానంద్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో కుటుంబ సభ్యులందరూ వెంటనే హాస్పిటల్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం శర్వానంద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్న కుటుంబ సభ్యులు మాత్రం ఎంతో ఆవేదనతో ఉన్నారు. కొద్ది రోజుల్లోనే పెళ్లి జరగాల్సిన‌ నేపథ్యంలో ఈ ప్రమాదం జరగడంతో శర్వానంద్ అప్పటికి కోలుకుంటాడా ? లేదా పెళ్లి వాయిదా పడుతుందా ? అన్న టెన్షన్ కూడా కుటుంబ సభ్యులు బంధువులలో ఉన్నట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news