Newsబాల‌య్య నోట ఘంట‌శాల పాట‌… లైవ్‌లో ఉండ‌గానే అదిరిపోయే ట్విస్ట్‌…!

బాల‌య్య నోట ఘంట‌శాల పాట‌… లైవ్‌లో ఉండ‌గానే అదిరిపోయే ట్విస్ట్‌…!

ఎన్టీఆర్ త‌న‌యుడు, టాలీవుడ్ అగ్ర‌హీరో నంద‌మూరి బాల‌కృష్ణ ఏం చేసినా ఓ ట్రెండ్ సెట్టింగ్ అయిపోయింది. బాల‌య్య సినిమా, డైలాగులు, ఫైట్లు, ఓటీటీ టాక్ షోలు.. బుల్లితెర షోలు.. చివ‌ర‌కు ఆయ‌న పాట పాడినా ఫ్యాన్స్‌కు మాత్ర‌మే కాదు తెలుగోళ్ల‌కు జై బాల‌య్యా అని నినాదాలు చేయ‌డం కామ‌న్ అయిపోయింది. బాల‌య్య‌… జై బాల‌య్య‌… జైజై బాల‌య్య అన్న నినాదాలు మార్మోగిపోతున్నాయి.

బాల‌య్య ఏం చేసినా ఆయ‌న వీరాభిమానుల‌కు ఆయ‌న‌పై ప్రేమ ఎప్ప‌టిక‌ప్పుడు పెరుగుతూనే ఉంటోంది. తాజాగా బాల‌య్య ఓ పాట వినిపించింది. ఆ పాట‌కు చాలా స్పెషాలిటీ ఉంది. ప్ర‌సిద్ధ సింగ‌ర్ ఘంట‌సాల ఆల‌పించిన పాట బాల‌య్య పాడ‌డం విశేషం. ఖతార్ రాజధాని దోహాలో ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌లు చాలా గ్రాండ్‌గా నిర్వ‌హించారు.

ఈ వేడుక‌ల‌కు చీఫ్ గెస్ట్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య పాట పాడ‌డం హైలెట్‌గా నిలిచింది. త‌న తండ్రి ఎన్టీఆర్ న‌టించిన జ‌గ‌దేక‌వీరుని క‌థ‌ సినిమాలోని ‘శివశంకరి’ అనే ప్ర‌సిద్ధ పాట బాల‌య్య పాడి అక్క‌డున్న వారిని అల‌రింప‌జేశాడు. అయితే బాల‌య్య లైవ్‌లో పాట పాడుతుండ‌గానే వెన‌క బ్యాక్‌గ్రౌండ్‌లో మంట‌లు చెల‌రేగుతున్న విజువ‌ల్స్ బాగా హైలెట్‌గా నిలిచాయి.

బాల‌య్య పాట పాడుతున్న రిథ‌మ్‌కు త‌గ్గ‌ట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌లో మంట‌లు ఒక్క‌సారిగా ఎగ‌సిప‌డుతుంటాయి. బాల‌య్య స్వ‌రానికి అభిమానుల ప్ర‌శంస‌ల‌తో పాటు మంట‌ల‌తో ర‌చ్చ మామూలుగా లేదు. ఇక బాల‌య్య ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న త‌న 108వ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా న‌డుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news