గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలు హీరోయిన్ తమన్నా కి అనిల్ రావిపూడి కి మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటూ ఓ న్యూస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎఫ్ 3 సినిమా చూస్తున్న టైంలు తమన్నా అనిల్ రావవిపుడి తెగ విసిగిచ్చిందని.. ఆ టైంలోనే అనిల్ – తమన్నాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరిందని.. ఎలాగోలా సినిమా షూట్ లు కంప్లీట్ చేశారని.. ఆ సినిమా రిలీజ్ టైం లో వార్తలు వినిపించాయి.ఆ తరువాత అనిల్ క్లారిటీ ఇచ్చాడు . “వాళ్ళు హీరోయిన్స్ ఏవో వర్క అబుట్స్ చేసుకోవాల్సి ఉంటుంది కదా ..ఒకరోజు షూటింగ్ లేట్ అయింది .. ఆ రోజు నైట్ కొంచెం మిస్ అండర్స్టాండింగ్ జరిగింది.. తప్పిస్తే మిగతా ఏదీ లేదు “అంటూ క్లారిటీ ఇచ్చాడు.
అయినా సరే తమన్న ఈ ఇష్యూ పై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఎక్కడో తమన్నాకి అనిల్ కి మధ్య ఫైటింగ్ జరుగుతుంది అని ఓ న్యూస్ వైరల్ అయింది . రీసెంట్గా తమన్న మరోసారి ఆ వార్తలకు ఆజ్యం పోసినట్టు అయింది . గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎన్బికె 108 సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ చేయబోతుంది అంటూ వార్తలు వినిపించాయి . ఈ క్రమంలోనే తమన్న అరియాక్ట్ అవుతూ..” నేను ఎన్ బీ కే 108 సినిమాలో ఎలాంటి పాత్ర చేయడం లేదు.. అనిల్ రావిపూడి గారు డైరెక్షన్లో చేయడానికి .. బాలయ్య గారితో నటించడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను .. ఏదైనా వార్తలు రాసే ముందు నిజమా కాదా అని తెలుసుకొని రాయండి . నేను ఆ సినిమాలో నటిస్తున్నాను అన్నదాంట్లో వాస్తవం లేదు . దయచేసి నమ్మకండి ” అంటూ బోల్డ్ గా ఘాటుగానే స్పందించింది .
ఆమె మాటలు విన్న ఎవరికైనా అర్థమైపోతుంది అమ్మడు అనిల్ రావిపూడి ని టార్గెట్ చేసింది అని . ఆయన డైరెక్షన్ నటించడానికి సిద్ధంగా లేదు అని . పైకి మాత్రమే అలా చెప్పిందని లో లోపల మాత్రం ఇలాంటి ఆఫర్ ఇచ్చిన తమన్నా చేయదు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు అనిల్ కూడా ఇప్పుడు తమన్నాతో చేయించుకోవడానికి సిద్ధంగా లేడట. అయితే దీని పై బాలయ్య సీరియస్ అయిన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి వార్తలు ఎన్నొ వస్తుంటాయి.. దానికి ఇంత సీన్ చేయాలా..? అంటూ కోపంగా ఉన్నారట. రీసెంట్గా ఈ సాంగ్ కోసం అనసూయ భరద్వాజ్ ను సెలెక్ట్ చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి . చూడాలి మరి అనసూయ ఈ వార్తల పై ఎలా క్లారిటీ ఇస్తుందో..?