కళ్ళు చెదిరే డబ్బు ఇచ్చినా .. IPL ఆఫర్ ని రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

0
190

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవికి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మలర్ అనే సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి .. ఫిదా సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సాయి పల్లవి ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాజ్యమేలేసింది. ఎంతలా అంటే లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకొని మరి అభిమానుల దగ్గర శభాష్ అనిపించుకుంది.

ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి మెయిన్ రీజన్ సాయి పల్లవి మొండితనం. ఎస్ తనకి నచ్చిన పనిని నచ్చినట్లు చేసే సాయి పల్లవి.. నచ్చని పని ఎవరు చెప్పినా చేయదు. రీసెంట్ గానే అలాంటి పని చేసి మరోసారి అభిమానుల చేత శభాష్ అనిపించుకుంటుంది. రీసెంట్ గా స్టార్ట్ అయిన ఐపీఎల్ ఓపెనింగ్ సెరిమనీలో సాయి పల్లవికి డాన్స్ చేసేందుకు గాను కళ్ళు చెదిరే ఆఫర్ చేశారట ఐపిఎల్ టీం.

అయితే సాయి పల్లవి ఎంత డబ్బును ఆఫర్ చేసిన రిజెక్ట్ చేసింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే సాయి పల్లవికి డబ్బు అంటే మోజు లేదని కేవలం ఇండస్ట్రీలో హీరోయిన్గా తన నటనకు వాల్యూ ఇవ్వడం తన నటనకు పేరు సంపాదించుకోవడం కోసమే ట్రై చేస్తుందని …మిగతా హీరోయిన్స్ కి సాయి పల్లవికి చాలా తేడా ఉంది అంటూ ఆమె పేరును ట్రెండ్ చేస్తున్నారు సాయి పల్లవి ఫ్యాన్స్..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here