టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసుకు దగ్గరవుతున్న కూడా ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళుతున్నారు. 67 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి అంతే ఎనర్జీ.. అంతే ఉత్సాహంతో యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ డ్యాన్సుల్లో చిరంజీవిని చూస్తే ముచ్చటేస్తుంది. కుర్రహీరోలు కూడా చిరంజీవిలా పోటీపడి డ్యాన్స్ చేయలేరేమో అన్నంత గొప్పగా ఆయన డ్యాన్స్ ఉంటుంది. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన చిరు త్వరలోనే మెహర్ రమేష్ దర్శకత్వంలో తరకెక్కిన భోళాశంకర్ సినిమాతో కూడా ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు.
ఇక చిరంజీవికి కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ కు ఒక లింక్ ఉంది. విజయ్ ను చిన్నప్పుడు చిరు స్వయంగా ఎత్తుకొని ఆడించిన సందర్భాలు ఉన్నాయి. మరి వీరిద్దరికి ఉన్న ఆ లింకు ఏంటో ?విజయ్ ఫ్యామిలీతో చిరుకు ఉన్న సానిహిత్యం ఏంటో ? చూద్దాం. చిరంజీవి హీరోగా 1981లో చట్టానికి కళ్ళు లేవు సినిమా తెరకెక్కింది. చిరంజీవి – మాధవి జంటగా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి కూడా మరో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
చట్టంలో ఉన్న లొసుగుల వల్ల నేరం చేసినవాడు ఎలా ? తప్పించుకుంటాడు. అలా చట్టం కళ్ళుగప్పి హీరో నేరస్తుల ఆట ఎలా ? కట్టించాడు.. అన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. విజయ్ గా చిరంజీవి, రేఖగా మాధవి నటించారు. సీనియర్ నటీమణి లక్ష్మీ కూడా ఒక కీలకపాత్రలో నటించారు. శ్రీకర ప్రొడక్షన్స్ గ్యానర్ పై అట్లూరి పూర్ణచంద్రరావు సమర్పణల్లో, వంకినేని సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించారు. పీఎస్. చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.
ఆ చంద్రశేఖర్ ఎవరో ? కాదు. కోలీవుడ్ హీరో విజయ్ తండ్రి కావటం విశేషం. ఈ సినిమా తమిళంలో సట్టం ఒరు ఇరుత్తరై అనే టైటిల్‌తో తెరకెక్కింది. ఇదే సినిమాను తెలుగులో చట్టానికి కళ్ళు లేవు పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. విజయ్ తండ్రి చంద్రశేఖర్ తెలుగులో చిరంజీవితో చట్టానికి కళ్ళు లేవు, అలాగే శోభన్ బాబు హీరోగా బలిదానం లాంటి సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు.
ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ గా ఉన్న శంకర్ ఈ చంద్రశేఖర్ దగ్గర 14 సినిమాలకు అసిస్టెంట్, కో డైరెక్టర్ గా పనిచేశారు. ఇక చట్టానికి కళ్ళు లేవు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు విజయ్ చిన్న పిల్లోడు. ఆ సినిమా షూటింగ్ సెట్లో చిరంజీవి విజయ్‌ని ఎత్తుకుని ఒక్కోసారి ఆడించేవారట. అలా ఆ కుటుంబంతో చిరంజీవికి సాన్నిహిత్యం ఉంది.