Moviesనా భ‌ర్త ఆ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడ‌ని ఏఎన్నార్‌కు కంప్లైట్ చేసిన...

నా భ‌ర్త ఆ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడ‌ని ఏఎన్నార్‌కు కంప్లైట్ చేసిన స్టార్ హీరో భార్య‌..!

ఎస్ ఇది నూటికి నూరు శాతం నిజం. అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న ఓ హీరో భార్య తన భర్త మరో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని.. తనకు, తన పిల్లలకు అన్యాయం చేస్తున్నాడు అంటూ అప్పటి స్టార్ హీరో ఏఎన్ఆర్ కు కంప్లైంట్ చేసి బాధపడ్డారట. దీంతో ఏఎన్ఆర్ ఆ స్టార్ హీరో గురించి అసలు నిజం చెప్పి.. ఆ హీరో గారి భార్య కళ్ళు తెరిపించారట. మరి ఆ స్టార్ హీరో, ఆ హీరోయిన్లు ఎవరు ? ఏంటో చూద్దాం.

టాలీవుడ్ లో దివంగత నటుడు రంగనాథ్ ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగారు. అలాగే సీనియర్ నటి లక్ష్మీ కూడా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి హీరోయిన్గా ఎదిగారు. విచిత్రం ఏంటంటే ఎంతోమంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలలో నటించిన లక్ష్మి ఎవరైనా తప్పు చేస్తే.. అటు వైపు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చూడకుండా చెడామడా తిట్టేసేదట.

ఆమెకు ముక్కుమీద‌ కోపం ఎక్కువ. ఆ కారణంతోనే ఆమెతో సినిమాలు చేసేందుకు చాలామంది హీరోలు వెనకడుగు వేసేవారట. కెరీర్ ప్రారంభంలో ఆమె రంగనాథను బాగా ఇష్టపడ్డారు. అయితే అప్పటికే రంగనాథ్‌కు చైతన్య అనే అమ్మాయితో పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. ఇక లక్ష్మి.. రంగనాథ్ కోసం తన ఇంట్లో చేసిన పచ్చళ్ళు, కూరలు ప్రత్యేకమైన పిండి వంటకాలు, బాదంపాలు మరి తీసుకువెళ్లి ఇచ్చేదట.

ఆ ప్రేమకు రంగనాథ్ కూడా పరవశించిపోయి లక్ష్మిని ప్రేమించడం మొదలుపెట్టార‌ట. అయితే ఈ విషయం తెలిసిన రంగనాథ్ భార్య చైతన్య.. ఏఎన్ఆర్ దగ్గరకు వెళ్లి మరి తన భర్త తనకు అన్యాయం చేస్తున్నాడని ఫిర్యాదు చేసిందట. వెంటనే ఏఎన్నార్ అమ్మ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి నాలుగు మాటలు మాట్లాడుకుని… కాస్తంత సన్నిహితంగా ఉన్నా అనుమానించే లోకం ఇది. ఈ అనుమానం మ‌హిళ‌ల‌కు బాగా ఎక్కువ‌.

అందులోనూ సినిమాలలో హీరో, హీరోయిన్ కలిసి నటిస్తున్నప్పుడు సహజంగానే ఇలాంటి అనుమానాలు వస్తాయి. ఒక మహిళగా నీ భర్తను నువ్వు అలా అనుమానించడంలో తప్పులేదు. కానీ రంగనాథ్ విషయంలో అలాంటి అనుమానాలు అక్కర్లేదు అని చెప్పి పంపారట. చాలా యేళ్లపాటు రంగనాథ్ భార్య చైతన్య.. రంగనాథ్ – లక్ష్మి మధ్య ఎఫైర్ ఉందని అనుమానించడంతో పాటు రకరకాలుగా అరిచి గోలపెట్టేదట.

చివరకు ఏఎన్ఆర్ తన భర్త గురించి చెప్పడంతో అక్కడి నుంచి వారిద్దరిని అనుమానించడం మానేసిందట. ఆ తర్వాత లక్ష్మి కూడా రంగనాథ్‌కు భార్య పిల్లలు ఉండడం.. వారి భార్య అనుమానాల నేప‌థ్యంలో ఇకనుంచి మనిద్దరి కాంబినేషన్లో సినిమా రాదు.. అని చెప్పి మరి రంగనాథ్‌కు దూరమైందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news