నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన సినిమా దసరా. శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్ వచ్చింది. అటు ఓవర్సీస్ లోను కలెక్షన్లు అదిరిపోయాయి. ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు దాటేసింది. ఇక నైజాంలో అయితే ఈ సినిమాకు లాభాల పంట పండింది. అమెరికా, ఆస్ట్రేలియా తో పాటు సింగపూర్, దుబాయ్ లాంటి చోట కూడా కలెక్షన్ల దుమ్ము దులిపాయి.
అయితే విచిత్రంగా ఆంధ్రకు వచ్చేసరికి మంచి ఓపెనింగ్ వచ్చి ఆ తర్వాత సడన్‌గా డల్ అయిపోయింది. ఆంధ్ర అంటే అటు సీడెడ్ తో పాటు ఇటు ఆంధ్ర రెండు చోట్ల కూడా ఎందుకిలా ? జరిగింది అన్నది అంతు పట్టని ప్రశ్నగా మారింది. నైజాం, ఓవర్సీస్ జనాలు అందరికీ పిచ్చపిచ్చగా ఇచ్చిన సినిమా ఆంధ్ర, సీడెడ్ జనాలకు ఎందుకు ? నచ్చలేదు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
నిజానికి సినిమా బాగోలేదు అంటే అన్నిచోట్ల ఒకటే ఫలితం ఉంటుంది. పోనీ మాండలికం సమస్య అనుకుంటే దసరా సినిమా మొత్తం తెలంగాణ మండలికం ఎక్కువగా వాడారు. తెలంగాణ జనాలు కూడా కొన్నిచోట్ల అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడ్డారు.. ఆంధ్ర జనాలే కొంతవరకు ఆ మాండలికం అర్థం చేసుకున్నట్టు చాలామంది చెప్పారు. అయితే ఈ మండలికం సీడెడ్ జనాల్లో బాగా సమస్యగా మారిందని.. సీడెడ్ ప్రేక్షకులకు నాని మాట్లాడిన మాటలు అర్థం చేసుకునే విషయంలో కొంత గందరగోళం ఉందని తెలుస్తోంది.
గతంలో కోటా శ్రీనివాసరావు లాంటి నటులు తెలంగాణ మండలికంలో డైలాగులు చెప్పిననా చాలా నెమ్మదిగా చెప్పేవారు. అవి జనాలకు బాగా అర్థమయ్యేవి.. ప్రేక్షకుల బుర్రలోకి బాగా ఎక్కేవి. అయితే ఇప్పుడు నాని దసరా సినిమాలో తెలంగాణ మండలికంలో చెప్పిన డైలాగులు చాలా స్పీడ్ గా చెప్పుకుంటూ వెళ్లిపోయారు. ఇక్కడే అసలు సమస్య ఎదురైనట్టు తెలుస్తోంది. వీటిని అందరూ క్యాష్ చేయలేకపోయారు అన్నది ప్రధానంగా కంప్లైంట్ గా చెబుతున్నారు. అయితే దసరా సినిమాకు అదృష్టం ఏంటంటే మంచి ఓపెనింగ్ రావడంతో పాటు ఈ వారం కూడా వరుసగా సెలవులు వీకెండ్ రావడం.