Moviesఆ యంగ్ హీరోయిన్‌, టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ క్యాస్టింగ్ కౌచ్ రిలేష‌న్‌..!

ఆ యంగ్ హీరోయిన్‌, టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ క్యాస్టింగ్ కౌచ్ రిలేష‌న్‌..!

టాలీవుడ్ లో ఆయ‌న‌ ఒక స్టార్ డైరెక్టర్. మాటలతోనే మంత్రం వేస్తాడని పేరు ఉన్న ఆ డైరెక్టర్ ఓ యంగ్ హీరోయిన్ మధ్య ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ తరహా రిలేషన్ నడుస్తుందన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. విచిత్రం ఏంటంటే ? ఆ డైరెక్టర్ ఈ హీరోయిన్ కు తన సినిమాలలో ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. కానీ తాను తెరవనక ఉండి నడిపిస్తున్న సినిమాలతో పాటు.. తాను కంట్రోల్ చేసే ఓ పెద్ద హీరో సినిమాలోనూ ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు.

ఆమె ఓ మ‌ళ‌యాళీ ముద్దుగుమ్మ‌. కాస్త అందంతో పాటు మంచి అభిన‌యం కూడా ఆమె సొంతం. ఏది ఏమైనా ఆమెకు టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులలో వరుసగా అవకాశాలు రావడం వెనక ఆ స్టార్ డైరెక్టర్ ఉన్నారన్న గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. ఇటీవల తనకు అత్యంత ఆప్తుడుగా ఉండే ఓ స్టార్ హీరో సినిమాలో ఆమెకు హీరోయిన్ కు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత అంతా కనుసన్నల్లోనే నడిచే ఓ బ్యానర్లో తెర‌కెక్కిన సినిమాలోనూ ఆమెనే హీరోయిన్గా తీసుకున్నారు.

ఆ సినిమాలో పొరుగు ఇండ‌స్ట్రీ స్టార్ హీరోకు జోడీగా ఆమె న‌టించారు. ఆ సినిమాలో ఆమె పాత్ర బాగా పండింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే బ్యానర్ లో వస్తున్న మరో ఒకటి రెండు సినిమాలలోనూ ఆమెని హీరోయిన్గా బుక్ చేసేలా సద‌రు డైరెక్టర్ తెరవెనక చక్రం తిప్పారట. అంతేకాకుండా తనకు పరిచయం ఉన్న దర్శకులకు కూడా ఫోన్లు చేసి ఆమెకు హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వాలని మరి రిక్వెస్ట్ చేస్తున్నారట. అయితే స‌ద‌రు హీరోయిన్ కూడా త‌న‌పై అంత శ్ర‌ద్ధ చూపిస్తుండ‌డంతో ఆ డైరెక్ట‌ర్‌కు బాగా కోప‌రేట్ చేస్తోంద‌ట‌.

దీనిని బట్టి ఆ హీరోయిన్ తో ఆ స్టార్ డైరెక్టర్ క్యాస్టింగ్ కౌచ్‌ రిలేషన్ ఒక రేంజ్ లో ఉందని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు. సదరు స్టార్ డైరెక్టర్ తాను రిలేషన్ పెట్టుకున్న హీరోయిన్లనే వరుసగా తన సినిమాలలో రిపీట్ చేస్తూ ఉంటారు. అయితే ఆయన ఇటీవల సినిమా సినిమాకు బాగా గ్యాప్ తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఆ హీరోయిన్ ను తెరవెనక మెయింటైన్ చేస్తూ.. ఆమెకు అవకాశాలు ఇప్పించేందుకు బాగా కష్టపడుతున్నారని భోగ‌ట్టా..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news