సమంత నటించిన శాకుంతలం సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా షూటింగ్ నానుతూ… సాగుతూ వస్తోంది. ఎట్టకేలకు రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రిమియర్ షోలు కూడా వేసి సినీ సెలబ్రిటీలకు శాకుంతలం సినిమా చూపించారు. ఇక ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ రు. 40 కోట్ల బడ్జెట్‌తో స్టార్ట్ చేశారు.
ఈ ప్రాజెక్ట్ నచ్చి దిల్ రాజు ఇందులో జాయింట్ అయ్యారు. అయితే ఇద్దరి మధ్య పెట్టుబడులు ఏంటి ? లాభాలు ఏంటన్నది దిల్ రాజు, గుణశేఖర్‌కే తెలియాలి. అయితే రు. 40 కోట్లు అనుకున్న ఖర్చు కాస్తా రు. 54 కోట్లకు చేరిపోయింది. అయితే త్రీడీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అవ్వడంతో మరో రు. 10 కోట్లు పెరిగింది. దీంతో మొత్తం ఖర్చు రు. 64 కోట్లకు చేరుకుంది.
అయితే ఈ సినిమా మీద ఎవ్వరికి నమ్మకాలు లేవు. అటు దిల్ రాజు ఉన్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో ఎన్ ఆర్ ఏ పద్ధతిలో కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో రిటర్నబుల్ అడ్వాన్స్‌ల మీద ఈ సినిమాను ఇవ్వాల్సి వచ్చింది. నాన్ థియేటర్, ఇతరత్రా కలిపి రు. 40 కోట్లు లాగారు. ఇప్పుడు థియేట్రిలక్ మీద రు. 24 కోట్లు రావాల్సి ఉంది.
అంటే ఏపీ, తెలంగాణ నుంచి శాకుంతలం సినిమాకు దాదాపు 50 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తే నిర్మాత డబ్బులు వెనక్కు వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు ఆ బాధ్యత అంతా సమంత మీదే పడింది. మరి ఆ సమంత తన భుజస్కంధాల మీద ఈ టార్గెట్‌ను ఎంత వరకు చేధిస్తుందో ? చూడాలి.