పాపం స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత ..శాకుంతలం సినిమా అట్టర్ ప్లాప్ అయింది. ఎంతలా అంటే ఫస్ట్ డే డిజాస్టర్ కలెక్షన్స్ సాధించాయి. మరి ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న గుణశేఖర్ కలలను చిదిమేసింది శాకుంతలం . సినిమా కంటెంట్ పరంగా కధ పరంగా పెద్దగా చెప్పుకో తగ్గ ఎలిమెంట్స్ లేకపోవడంతో శకుంతలం సినిమాను డిజాస్టర్ గా మార్చేశారు సమంత ఫ్యాన్స్ . అంతేకాదు తెలిసిన కథను కూడా మరి ఇంత దరిద్రంగా తెరకెక్కిస్తారా అంటూ దారుణమైన కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి .
ఈ క్రమంలోని సమంత శాకుంతలం సినిమా డిజాస్టర్ టాక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా చాలా వెబ్ సైట్స్ 1.5 రేటింగ్ ఇవ్వడంతో సమంత నటించిన శాకుంతలం సినిమా డిజాస్టర్ గా బాప్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత ఆ ఒక్క పని చేస్తుంటే శా కుంతల సినిమా హిట్ అయి ఉండేది అంటూ సమంత ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . సమంత ఈ రోల్ ని యాక్సెప్ట్ చేసే ముందు నిజా నిజాలు తెలుసుకొని.. తాను ఈ పాత్రకు సూట్ అవుతానా లేదా కొంచమైనా ఆలోచించి యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండేదని కొన్ని సీన్స్ లో సమంత అస్సలు సెట్ అవ్వలేదని మరీ ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ సమంతకు భారి దెబ్బ కొట్టాయని అంటున్నారు.
ఆమె ప్రతి ఇంటర్వ్యూలో శకుంతలంకి సంబంధించిన క్వశ్చన్స్ కన్నా తన పర్సనల్ లైఫ్ ప్రశ్నలు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువుగా ఎదురయ్యాయని.. ఏ ఇంటర్వ్యూలోనైనా సరే సమంత ఎదిరించి తెగించి అలాంటి ప్రశ్నలు అడగద్దు అని ఒక్క మాట చెప్పి ఉంటే.. శకుంతల సినిమా ఇంత డిజాస్టర్ అయి ఉండేది కాదని ..రిజల్ట్ వేరే లా ఉండేదని చెప్పుకొస్తున్నారు. రిపోర్టర్లు ఆమె పర్సనల్ లైఫ్ కాకుండా సినిమాపై ప్రశ్నలు వేసి ఉండే ఖచ్చితంగా సినిమా కాస్తో కూస్తో హిట్ అయ్యేదని కామెంత్స్ చేస్తున్నారు. వారిని అలా అడ్డుకోకపోవడంతోనే సమంత నటించిన శాకుంతలం సినిమా ఇంత డిజాస్టర్ గా మారిందని చెప్పుకొస్తున్నారు. ఏ మాటక ఆ మాట విడాకుల తర్వాత ఫస్ట్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది సమంత అని చెప్పక తప్పదు.