సమంత…దిల్ రాజు..గుణశేఖర్. పెద్ద పెద్ద పేర్లు కానీ కానీ నిన్న రిలీజ్ అయిన శాకుంతలం తొలి రోజు వసూళ్లు చూస్తే ఘోర అవమానమే. అసలు ఈ సినిమాలో సమంత ఉందని పెద్ద ఎత్తున హడావిడి చేశారు. సమంత కన్నీళ్లు పెట్టేసుకుని సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేసింది. ఇక దిల్ రాజు, గుణశేఖర్ కలిసి పెట్టారా.. లేదా విడివిడిగా పెట్టారో తెలియదు కాని మొత్తం రు. 70 కోట్లు పెట్టుబడి పెట్టారు. కానీ రెండు విధాల షాక్ తగిలింది.
సినిమా మాకొద్దు అంటే మాకొద్దు అని బయ్యర్లు అని ఎవ్వరూ కోనలేదు. చివరకు అడ్వాన్స్‌ల మీద రిలీజ్ చేచశారు. సినిమాకు ఏ మాత్రం ఓపెనింగ్స్ రాలేదు. ఉత్తరాంధ్రలో పట్టుమని 14 లక్షలు షేర్ రాలేదు. అదే యశోదకు 16 లక్షలు వచ్చింది. లారెన్స్ సినిమా రుద్రుడు సినిమాకు అంచనాలు లేవు. అయినా ఉత్తరాంధ్రలో పది లక్షలు షేర్ రాబట్టింది.
ఇక శాకుంతలంకు నైజాంలో రు. 75 లక్షల రేంజ్‌లో షేర్ వచ్చిందట. అదే యశోదకు తొలి రోజు రు. 65 లక్షల వరకు వచ్చింది. అంటే సమంత స్టామినా అంతే అనుకోవాలా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి. యశోద బడ్జెట్ రు. 35 రేషియోలో.. శాకుంతలంకు రు. 70 కోట్ల వరకు అయ్యింది. పైగా శాకుంతలంకు భారీగా ప్రమోషన్లు చేశారు. ప్రీమియర్లు వేస్తే టాక్ ముందే తేడా కొట్టేసింది.
ఇక యూఎస్‌లో అయితే తొలిరోజు 1.25 లక్షల డాలర్లు కొల్లగొట్టింది. ఏదేమైనా ప్రీమియర్ వేయడం అన్నది సినిమాకు చాలా మైనస్ అయ్యింది. ఓవరాల్‌గా సమంత కెరీర్‌లోనే చెత్త రికార్డుతో పాటు సమంత పనైపోయిందన్న సంకేతాలు శాకుంతలం పంపేసింది.