Moviesరమాప్ర‌భ - రాజ‌బాబు 100 రోజులు మాయ‌మైపోయారా.. అప్ప‌ట్లో ఏం జ‌రిగింది..!

రమాప్ర‌భ – రాజ‌బాబు 100 రోజులు మాయ‌మైపోయారా.. అప్ప‌ట్లో ఏం జ‌రిగింది..!

టాలీవుడ్ లో సీనియర్ నటిమని రమాప్రభ దివంగత కమెడియన్ రాజబాబు కాంబినేషన్‌కు తిరుగులేని క్రేజ్ ఉండేది. వారిద్దరూ కలిసి జంటగా ఎన్నో ? సినిమాలలో నటించారు. అప్పట్లో స్టార్ హీరోల సినిమాలలో ఈ జంట చేసే కామెడీ బాగా పేలేది. రమాప్రభ – రాజబాబు సినిమాలో జోడిగా నటిస్తున్నారు అంటే వీరికోసమే థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు కూడా లక్షల్లో ఉండేవారు. అలాంటి అరుదైన అభిమానం ఈ జంట కొన్ని దశాబ్దాల క్రితమే సొంతం చేసుకుంది.

వీరిద్దరూ కలిసి పదుల సంఖ్యలో సినిమాలలో జోడిగా నటించారు. ఈ క్రమంలోనే వీరి మధ్య పరిచయం ప్రేమగా మారి చివరకు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థాయికి వచ్చిందని కూడా అప్పట్లో గుసగుసలు ఉండేవి. రమాప్రభ మంచి అందగత్తె.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఎంత పెద్ద దర్శ‌కుడు అయినా సినిమా తీయాలంటే ముందుగా రమాప్రభ.. రాజబాబుకు అడ్వాన్స్ ఇవ్వమని చెప్పేవారట.

అంటే ముందుగా ఈ ఇద్దరిని సినిమాకు బుక్ చేసిన తర్వాతే మిగిలిన హీరో, హీరోయిన్లు ఇతర నటి న‌టులను బుక్ చేసేవారట. దీనిని బట్టి ఈ జంట ఏ స్థాయిలో ? ఉందో తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే అప్పట్లో రమాప్రభ – రాజబాబు 100 రోజులపాటు ఎవరికి కనపడకుండా మాయమయ్యారట. దీనిపై ఐదు దశాబ్దాల క్రితమే టాలీవుడ్ లో పెద్ద చర్చ జరిగింది. దీనికి కారణం ఏంటంటే ? వరుసగా సినిమాలలో వీరిద్దరిని బుక్ చేసుకుంటూ వస్తున్నారు.

వీరిద్దరు షూటింగ్ చెన్నైతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కలిసే ఉండేదట. దీంతో మూడు నెలలపాటు వీరిద్దరూ కలిసి సినిమాలలో నటించడం.. ఒకే కారులో వెళ్ళటం, కలిసి ప్రయాణించటం.. చివరకు ఒకే రూమ్‌లో పడుకోవటం కూడా జరిగింది. అలా మూడు నెలల పాటు వీరిద్దరూ కలిసి మెలిసే ఉన్నారు. దీంతో అసలు రమాప్రభ – రాజబాబు బయట ఎవరికి కనపడకపోవడంతో మీరిద్దరూ ఏమైపోయారు ?అంటూ వీరిపై రకరకాల పుకార్లు బయలుదేరాయట.

అంటే వీరిద్దరూ అంత బిజీగా సినిమా షూటింగ్లలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సహజీవనం కూడా జరిగిందని చాలామందికి తెలిసిన విషయమే. అప్పటికే రాజబాబుకు పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఆ తర్వాత రమాప్రభ తనకంటే వయసులో చిన్నోడు అయిన‌ శరత్ బాబు ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది. కొన్నేళ్లు కాపురం చేశాక అతనికి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news