లారెన్స్ నటించిన రుద్రుడు సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌తోనే మాస్ విహారం చేసిన ఈ సినిమాపై మాస్‌లో, లారెన్స్ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రోజు రిలీజ్ అయిన రుద్రుడు ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
స్టోరీ :
రుద్ర(రాఘవ లారెన్స్) తన అమ్మ నాన్నలు దేవరాజు(నాజర్), ఇంద్రాణి(పూర్ణిమ భాగ్యరాజ్) లతో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అనన్య(ప్రియా భవాని శంకర్) ని తొలి చూపులో ప్రేమిస్తాడు. తమ కుటుంబానికి వచ్చిన కష్టంతో రుద్ర జీవితం మారిపోతుంది. ఈ క్రమంలోనే రుద్ర తన సమస్యలు సాల్వ్ చేసేందుకు లండన్ వెళతాడు. ఈ క్రమంలోనే రుద్ర తల్లి మరణిస్తుంది. అతడి భార్య మిస్ అవుతుంది. లండన్ నుంచి వచ్చిన రుద్ర ఈ విషయం తెలుసుకుని ఏం చేశాడు ? ఈ కథకు భూమి (శరత్ కుమార్) సంబంధం ఏంటి? అన్నదే ఈ సినిమా స్టోరీ.
విశ్లేషణ :
ఈ సినిమాకు మెయిన్ ఫిల్లర్ లారెన్స్. చాలా కాలం తర్వాత లారెన్స్ హీరోగా చేసిన ఈ సినిమాలో లారెన్స్ నుంచి మనం ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. తన లుక్స్, డ్యాన్సులు, ఎమోషనల్‌గా లారెన్స్ మరోసారి కదిలిస్తాడు. లారెన్స్ యాక్షన్ ఫరంగా సాలిడ్ పెర్పామెన్స్ ఇస్తాడు. ఇక హీరోయిన్ ప్రియా భవాని శంకర్ డీసెంట్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుంది.
సినిమాలో సెకండాఫ్ మెయిన్ హైలెట్. సెకండాఫ్ ఆడియెన్స్ లో ఆసక్తి రేపుతోంది. క్లైమాక్స్ పార్ట్ బాగా వర్కవుట్ అయ్యింది. సినిమాలో కథ లేదు. పరమ రొటీన్. ఫస్టాఫ్ పెద్ద బోర్. సీన్లలో లాజిక్ లేదు. ఫస్టాఫ్ లో మరింత ఎమోషన్స్ రాబట్టే స్కోప్ ఉన్నా దర్శకుడు కదిరేశన్ ఆ పని చేయలేదు. ఇక స్క్రీన్ ప్లే పరమ రొటీన్‌గా ఉంది.
సినిమా అంతా రొటీన్ రెగ్యులర్ మాస్ డ్రామా చూసినట్టే అనిపిస్తుంది. శరత్ కుమార్ లాంటి సాలిడ్ పర్సనాలిటీ క్యారెక్టర్ ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసే స్కోప్ ఉన్నా ఆ పని చేయలేదు. టెక్నికల్‌గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరీ ఓవర్‌గా ఉంది. ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ మంచి కలర్‌ఫుల్ గా ప్రజెంట్ చేశారు. లారెన్స్ కాస్ట్యూమ్స్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఫస్టాఫ్ కాస్త ట్రిమ్ చేయాల్సి ఉంది. దర్శకుడు కదిరేశన్ సెకండాఫ్ బాగా హ్యాండిల్ చేసినా… ఫస్టాఫ్ కూడా అదే రీతిలో తెరకెక్కించి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా రుద్రుడు పరమ రొటీన్ యాక్షన్ డ్రామా.
రుద్రుడు ఫైనల్ పంచ్: మాస్ రుద్రుడు.. లారెన్స్ విశ్వరూపం
రుద్రుడు రేటింగ్: 2.5 / 5