దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ ఊరిస్తూ ఊరిస్తూ ఎట్టకేలకు ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో వస్తోన్న సినిమాతో ఆమె సౌత్ సినీ ఎంట్రీ ఇస్తోంది. జాన్వీ కపూర్ నటిస్తోన్న ఓ షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం నడుస్తోంది. అయితే తొలి సినిమాతోనే ఆమె దారుణమైన బిహేవియర్ గురించి ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో పెద్ద చర్చలే నడుస్తున్నాయి.
ఈ సినిమా కోసం జాన్వీకి రు. 4 కోట్లు ఇస్తామని మేకర్స్ అడిగారట. అయితే అందుకు ఆమె ససేమీరా అన్నట్టు తెలిసింది. రు. 5 కోట్లకు తక్కువ అయితే తాను డేట్లు ఇవ్వలేనని చెప్పడంతో చివరకు నిర్మాతలు ఆమె అడిగినంత సమర్పించుకుంటున్నారు. దీనికి తోడు ఇద్దరు అసిస్టెంట్లతో పాటు వారి సౌకర్యాల భారం కూడా నిర్మాతల మీదే పడుతోంది.
అంటే ఈ లెక్కన ఆమెకు ముట్టే రెమ్యునరేషన్ అన్నీ కలుపుకుంటే రు. 6 కోట్లు దాటిపోతోంది. సాహో సినిమాకు శ్రద్ధాకపూర్ రు. 5 కోట్లు తీసుకుంది. ఇక కియారా అద్వానీ కూడా రామ్‌చరణ్ గేమ్‌ఛేంజర్‌కు అంతే తీసుకుంటోందట. అయితే తొలి సినిమాకే జాన్వీ రు. 5 కోట్లు డిమాండ్ చేస్తుండడంతో పాటు తన అసిస్టెంట్ల ఖర్చంతా భరించాలన్న డిమాండ్లతో టాలీవుడ్ షాక్ అవుతోంది.
తొలి సినిమాతోనే జాన్వీ ఇన్ని గొంతెమ్మ కోర్కెలు కోరితే ఎలా ? అని ముక్కున వేలేసుసుకుంటున్నారు.
అసలు బాలీవుడ్ లో ఆమెకు పాపులారిటీ అంతంతమాత్రం. ఇప్పటివరకు సాలిడ్ హిట్ లేదనే చెప్పాలి. ఓ వైపు అక్కడ పెద్ద హీరోలు ఆమెకు అవకాశం ఇవ్వడం లేదు. మరి టాలీవుడ్‌లో ముందే భారీ రెమ్యునరేషన్లు అడుగుతోంది. ఇలా అయితే ఇక్కడ జాన్వీకి కెరీర్ కష్టమే అంటున్నారు.