Moviesవేదం హీరోయిన్ దీక్షాసేథ్ ఆ హీరో టార్చ‌ర్ భ‌రించ‌లేకే టాలీవుడ్‌కు దూర‌మైందా...

వేదం హీరోయిన్ దీక్షాసేథ్ ఆ హీరో టార్చ‌ర్ భ‌రించ‌లేకే టాలీవుడ్‌కు దూర‌మైందా ?

సినిమా సెలబ్రిటీల జీవితం ఎప్పుడు ఎలా ? ఉంటుందో తెలియదు. ఈ రంగుల ప్రపంచాన్ని ఏలి ఆ వెంటనే కనుమరుగైపోతూ ఉంటారు. ఒకప్పుడు బ్రహ్మరథం పట్టించుకున్న వారు ఇప్పుడు అసలు ఎక్కడ ?ఉన్నారో ఏం చేస్తున్నారో ? కూడా తెలియని స్థితికి వెళ్లి పోతారు. ముఖ్యంగా సినిమా రంగంలో ఫామ్ లో ఉన్న హీరోయిన్లను ఆ టైంలో దేవతల చూస్తూ ఉంటారు. వాళ్లు కనుమరుగయ్యాక వాళ్ల గురించి ఎవరు ఆరా ? తీయరు. అలాంటివారిలో అల్లు అర్జున్ వేదం హీరోయిన్ దీక్షాసేత్ ఒకరు.

ఆమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. వేదం సినిమాలో అల్లు అర్జున్ రిచ్ గర్ల్ ఫ్రెండ్ గా పరిచయమైన దీక్ష.. తొలి సినిమాతోనే తన పొగరు లాంటి పాత్రతో మంచి క్రేజీ సొంతం చేసుకుంది. వేధం తర్వాత ఆమెకు తెలుగులో మంచి ఆఫర్లు క్యూ కట్టాయి. టాలీవుడ్ లో టైర్ 2 హీరోలకు జోడిగా వరుస పెట్టి సినిమాలలో నటించింది.

గోపీచంద్ వాంటెడ్ – రవితేజ నిప్పు, మిరపకాయ్ – ప్రభాస్ రెబల్ ఇలా వెంటవెంటనే సినిమాలు చేసి అప్పట్లో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేకపోయినా… దీక్ష గ్లామర్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు అప్పట్లో ఆమెను టాలీవుడ్ కత్రినా కైఫ్ అని ముద్దుగా పిలుచుకునేవారు. ఆ తర్వాత తెలుగులో ఆమె మంచు మనోజ్ నటించిన ఉలిక్కిపడతారా సినిమాలోని హీరోయిన్గా నటించింది.

ఆ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు కనుమరుగయ్యాయి. ఎన్నో ఆశ‌ల‌తో బాలీవుడ్లోకి వెళ్లిన ఆమెకు అక్కడ కూడా నిరాశే ఎదురయింది. ఆమె బాలీవుడ్లో నటించిన మూడు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. చివరకు కనడంలో దర్శన్‌ సరసన జగ్గు భాయ్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా అట్టర్ ప్లాప్. ఇలా ఆమె కెరీర్లో ఎక్కువగా ప్లాప్ సినిమాలు ఉన్నాయి. దీంతో ఆమెను ఐరన్ లెగ్ అని కూడా పిలిచేవారు.

ఇదిలా ఉంటే దీక్ష టాలీవుడ్‌లో సినిమాలు చేస్తోన్న క్ర‌మంలోనే ఓ టైర్ 2 యంగ్ హీరోను ఆమె బాగా హెరాస్ చేసేవాడ‌ని.. ముందు స‌ద‌రు హీరోతో ఆమె మంచిగా ఉండేందుకు ట్రై చేసినా అత‌డు చేసే హెరాస్ త‌ట్టుకోలేకే ఆమె టాలీవుడ్‌కు దూర‌మైంద‌న్న గుస‌గుస‌లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆమె లండ‌న్‌లో ఉంటూ ఐటీ ఉద్యోగం చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news