ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నువ్వు నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ అనిత హస్సానందిని. మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో పాటు అనిత తన అందం నటనతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ఈ సినిమాలో అనిత అందం అభినయానికి కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాత అనిత తొట్టి గ్యాంగ్, నిన్ను ఇష్టపడ్డాను, నేను పెళ్ళికి రెడీ, శ్రీరామ్ లాంటి సినిమాలలో నటించింది. ఉదయ్కిరణ్కు అనిత అంటే మంచి సెంటిమెంట్. వీరిద్దరి నువ్వు నేను తర్వాత శ్రీరామ్ సినిమాలో మరోసారి నటించారు.
అయితే నువ్వు నేను తర్వాత మళ్లీ అంతటి హిట్ మాత్రం ఆమెకు పడలేదు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ హిందీ కన్నడ భాషలలోనూ అనిత హస్సానందిని సినిమాలు చేసింది. అయితే కెరీర్ సో సో గా ఉండటంతో సినిమాలను వదిలేసి 2013 అక్టోబర్ లో పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా అనిత పెళ్లి చేసుకుంది కూడా తెలుగు వ్యక్తి అయిన రోహిత్ రెడ్డిని. వీరి వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది.
ఇక వీరి ప్రేమకు గుర్తుగా 2021 ఫిబ్రవరిలో అరవ్ అనే మగ బిడ్డకు జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత అనిత సినిమాలు పూర్తిగా తగ్గించింది. బాలీవుడ్ సీరియల్స్ లో నటిస్తోంది. సినిమాలకు దూరమైనప్పటికీ అనిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
తాజాగా అనిత తన ఫోటోలను షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో నువ్వు నేను సినిమా హీరోయిన్ ఇంతలా మారిపోయిందా అని ప్రేక్షకులకు అవాక్కవుతున్నారు. అనిత కుమారుడు అరవ్ కూడా ఆమెలాగే క్యూట్ గా ఉండటంతో ప్రేక్షకులు బుడ్డోడికి ఫిదా అవుతున్నారు. ఇక ఇప్పటికే చాలామంది సినిమాలకు దూరమైన నటీమణులు రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అనిత కూడా రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.