గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక విడాకుల న్యూస్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జొన్నలగడ్డ చైతన్యతో వివాహం జరిగిన నిహారిక త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . దానికి మెయిన్ రీజన్ రీసెంట్ గానే జొన్నలగడ్డ చైతన్య నిహారికతో జరిగిన పెళ్లి ఫొటోస్ ని డిలీట్ చేశాడు . అంతేకాదు ఇద్దరూ ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్నారు .
ఈ క్రమంలోనే నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే సేమ్ టు సేమ్ సమంత కూడా డివర్స్ తీసుకునే ముందు తన ఇంటిపేరుని మార్చేసిందని .. నాగచైతన్యను అన్ ఫాలో చేసిందని జనాలు చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే నిహారిక – సమంత జీవితాలలో చాలా విషయాలు కో ఇన్సిడెంట్స్ అవుతున్నాయని సోషల్ మీడియాలో న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
సమంత కూడా నాగచైతన్యతో విడాకులు తీసుకోవడానికి కారణం సినిమాలే అంటూ తెలుస్తుంది . ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించిన సమంతను అక్కినేని ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదని.. ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సేమ్ టు సేమ్ అదే విధంగా నిహారిక కూడా ఇండస్ట్రీలో కొనసాగడం జొన్నలగడ్డ ఫ్యామిలీకి నచ్చలేదని.. ఈ క్రమంలోనే చైతన్య నిహారికల మధ్య మనస్పర్ధలు ఏర్పడి ఏకంగా డివర్స్ తీసుకునే స్థాయికి వెళ్లిపోయాయి అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు అప్పట్లో సమంత చేసిన తప్పే ఇప్పుడు నిహారిక చేస్తుందని .. ఫ్యామిలీస్ లో ప్రాబ్లమ్స్ వచ్చాక కూర్చొని సాల్వ్ చేసుకోవాలి కానీ ఇలాంటి డెసీషన్ తీసుకోకూడదు అని.. చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోని మరోసారి నిహారిక – సమంత ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!