Moviesచిరంజీవిని కెరీర్ స్టార్టింగ్‌లోనే ఘోరంగా అవ‌మానించిన స్టార్ హీరోయిన్‌... చాలా పొగ‌రుతో..!

చిరంజీవిని కెరీర్ స్టార్టింగ్‌లోనే ఘోరంగా అవ‌మానించిన స్టార్ హీరోయిన్‌… చాలా పొగ‌రుతో..!

లైఫ్ లో ఎప్పుడు ఎవ‌రి స్థాయి ఎలా ఉంటుందో ఊహించ‌లేం. ఈ రోజు తిన‌డానికి తిండికూడా లేని వాళ్లు ఫ్యూచ‌ర్ లో కోటీశ్వ‌రులు అవ్వొచ్చు. ఈ రోజు కోట్లు ఉన్న‌వాళ్లు రేపు బికారీలు అవ్వొచ్చు. కాబ‌ట్టి ఎవ్వ‌రినీ త‌క్కువ అంచనా వేయ‌కూడదు. మెగాస్టార్ చిరంజీవి ఒక‌ప్పుడు సాధార‌ణ కానిస్టేబుల్ కుమారుడు మాత్రమే. కానీ ఇప్పుడు ఆయ‌న టాలీవుడ్ కే మెగాస్టార్ గా ఎదిగారు.

అంతే కాకుండా ఆయన ఇంటి నుండే ఇప్పుడు ఎనిమిది మంది హీరోలు సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్నారు. ఇక ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌స్తే ఎన్ని అవ‌మానాలు ఎదురుకోవాలో చిరంజీవి కూడా అన్ని అవ‌మానాల‌ను ఎదురుకున్నారు. చాలా అవ‌మానాలు ఎదురైన‌ప్ప‌టికీ చిరంజీవి వాటిని ఎప్పుడూ ఎవ‌రి ద‌గ్గ‌రా షేర్ చేసుకోలేద‌ట‌. ఒక‌వేళ ఎవ‌రిద‌గ్గ‌రైనా చెబితే వాళ్లు కూడా త‌న‌ను చుల‌క‌న‌గా చూస్తారేమో అని బ‌య‌ప‌డిపోయేవార‌ట‌.

అంతే కాకుండా సినిమా అవ‌కాశాలు కూడా పోయే ఛాన్స్ ఉంద‌ని సైలెంట్ గా ఉండేవారు. ఒకానొక స‌మ‌యంలో ఓ హీరోయిన్ నా ప‌క్కన కూర్చుంటావా అంటూ మెగాస్టార్ ను దారుణంగా అవ‌మానించిన రోజులు కూడా ఉన్నాయి. ఇంత‌కీ ఎవ‌రా హీరోయ‌న్ ఎందుకలా అవ‌మానించింది. ఆ వివ‌రాలు ఇప్పుడు చూద్దాం…కెరీర్ ప్రారంభంలో చిరంజీవి హీరోయిన్ మాధ‌వితో క‌లిసి ఓ సినిమాలో న‌టించారు. ఆ త‌ర‌వాత మాధ‌వి తమిళ ఫుల్ బిజీగా మారిపోయింది.

అంతేకాకుండా మాధ‌వి అక్క‌డ స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇక చిరు ఏమో చిన్న ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేస్తున్నాడు. అలాంటి స‌మ‌యంలో చిరంజీవికి పెద్ద డైరెక్ట‌ర్ పిలిచి అవ‌కాశం ఇచ్చారు. ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా మాధ‌విని తీసుకున్నారు. ఇక సినిమా షూటింగ్ మ‌ద్రాస్ లో జరుగుతున్న స‌మ‌యంలో హీరోయిన్ కు ల‌గ్జ‌రీ హోట‌ల్ బుక్ చేస్తే చిరుకు మామూలు హోట‌ల్ లో బ‌స ఏర్పాటు చేశారు. ఇక షూటింగ్ లో కూడా మాధ‌వి చిరును ప‌ట్టించుకునేవారు కాద‌ట‌.

ఓ రోజు షూటింగ్ పూర్తైన త‌ర‌వాత మాధ‌విని హోట‌ల్ లో దింప‌డానికి వెళ్లే స‌మ‌యంలో అదే కారులో చిరును కూడా డ్రాప్ చేయాల‌ని నిర్మాత చెప్పార‌ట‌. దాంతో మాధ‌వి కార్ లో ఉన్న స‌మ‌యంలో చిరు అమె ప‌క్క‌న కూర్చునే ప్ర‌య‌త్నం చేశార‌ట‌. దాంతో మాధ‌వి నా ప‌క్క‌న కూర్చుంటావా అని ఒక్క‌సారిగా షాక్ అయ్యార‌ట‌. ఇక చిరంజీవి అవ‌మానంతో ముందు సీట్ లో కూర్చుకున్నార‌ట‌. ఆమెకు ఇంత పొగ‌రేంటి అని చాలా ఫీల‌య్యాడ‌ట‌. అప్పుడే చిరు పెద్ద స్టార్ అవ్వాల‌ని ఖ‌రీదైన కార్ లు కొనుక్కొవాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news