బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్నా ..ఇప్పటికీ అందరికీ ఫేవరెట్ యాంకర్ గా ఉంది మాత్రం ఉదయభాను అని చెప్పాలి . డాన్స్ బేబీ డాన్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఉదయభాను ..మొదటి షో తోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది . ఎంతలా అంటే ఆ షోలో డాన్స్ చేసే కంటెస్టెంట్స్ కోసం ఎంతమంది వెయిట్ చేశారో తెలియదు కానీ .. షో ముందు హోస్ట్ చేసే యాంకర్ ఉదయభాను కోసం మాత్రం కుర్రాళ్ళు – ముసలోళ్ళు టీవీలో ఆ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఈగర్ గా ఎదురు చూసేవాళ్ళు .
అలాంటి ఓ క్రేజీ అభిమానాన్ని సంపాదించుకునింది ఉదయభాను . ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది . పలు ఈవెంట్స్ లో షోస్ కి హౌస్ట్ చేస్తూ నెంబర్ వన్ యాంకర్ గా సుమకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా కొన్నాళ్లకు ఉదయభాను యాంకర్ గా కనుమరుగైపోయింది . ఆ స్థానంలోకి కొత్త యాంకర్లు వచ్చారు.. అందరూ పెరిగిపోతున్న కాంపిటీషన్ కి ఉదయభాను తట్టుకోలేకపోయింది అనుకున్నారు. కానీ కొన్నాళ్ల తర్వాత అసలు నిజం బయటపడింది .
ఈవెంట్ కోసం ఓ ప్రముఖ సింగర్ తో అమెరికాలో షో కి వెళ్లిన ఉదయభాను ..ఆ సింగర్ ఆమెను అక్కడ దారుణంగా అవమానించారట . కనీసం స్టేజ్ పైకి కూడా పిలవకుండా మన తెలుగు యాంకర్ ని హేళనగా చూశారట . ఆరోజు హర్ట్ అయిన ఉదయభాను యాంకరింగ్ మానేయాలనంత కోపంతో ఉండిందట . ఈ క్రమంలోనే కొన్ని ఆఫర్స్ ను రిజెక్ట్ చేసిందని ..ఆ తర్వాత కొత్త యాంకర్లు ఇండస్ట్రీకి రావడంతో ఉదయభాను కెరియర్ పై కాన్సన్ట్రేషన్ చేయలేకపోయింది అని జనాలు అప్పట్లో చెప్పుకునే వారు. ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనదైనా స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ పలు సినిమాల్లోనూ అడపాదడప నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఉదయభాను . ప్రజెంట్ భర్త ఇద్దరు పిల్లలతో సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని లైఫ్ లో ముందుకు వెళుతుంది. అరాకొరా అవకాశాలు కూడా దక్కించుకుంటుంది..!!