MoviesManchu Vishnu మంచు విష్ణు భార్య విరానికా రెడ్డి గురించి ఈ...

Manchu Vishnu మంచు విష్ణు భార్య విరానికా రెడ్డి గురించి ఈ విష‌యం తెలిస్తే గింగ‌రాలు తిర‌గాల్సిందే..!

మంచు మోహ‌న్‌బాబు పెద్ద కోడ‌లు, మంచు విష్ణు భార్య వెరానికా రెడ్డి గురించి బ‌య‌ట ప్ర‌పంచానికి తెలిసింది చాలా త‌క్కువ‌. ఆమెకు రెండు వైపులా బ‌ల‌మైన కుటుంబాల అండ‌దండ‌లు ఉన్నాయి. ఇటు మోహ‌న్‌బాబు కుటుంబం సినిమా, రాజ‌కీయ రంగాల్లో పేరెన్నిక‌గా ఉంది. మోహ‌న్‌బాబు అంటే తెలియ‌ని తెలుగోడు ఉండ‌డు. ఐదు ద‌శాబ్దాలుగా సినిమా రంగంలో క‌లెక్ష‌న్‌కింగ్‌గా వెలుగొందుతూనే.. మ‌ధ్య‌లో రాజ‌కీయాల్లోనూ క‌నిపిస్తూ ఉంటారు.

మోహ‌న్‌బాబు తెలుగుదేశం నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. ఆయ‌న మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కుటుంబంతో వియ్యం అందుకోవ‌డ‌మే ఓ సంచ‌ల‌నం. విష్ణు – వెరానికా పెళ్లి 2009లో జ‌రిగింది. ఈ దంప‌తులు తాజాగా 14వ వివాహ వార్షికోత్స‌వం జ‌రుపుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే విరానికా గురించి ప్ర‌పంచానికి తెలియ‌ని ఆస‌క్తిక‌ర విష‌యాలు చాలానే ఉన్నాయి.

విరానికా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు చెల్లి. జ‌గ‌న్ చివ‌రి చిన్నాన్న ( రాజారెడ్డి నాలుగో కొడుకు) సుధాక‌ర్‌రెడ్డి, విద్యారెడ్డి దంపుతుల కుమార్తె. చిన‌ప్ప‌టి నుంచే ఆమె ఎక్కువుగా అమెరికాలో ఉన్నారు. చిన్న‌త‌నంలో ఆమెకు డాక్ట‌ర్ కావాల‌న్న కోరిక ఉండేది. ఆ త‌ర్వాత ఆమె వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఆమె వ్యాపారంలోకి ఎంట‌ర్ అయిన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు వెన‌క్కు తిరిగి చూసుకోలేదు.

రాజారెడ్డి కుటుంబంలో చిన్న మ‌న‌వ‌రాలిగా వెరానికా రెడ్డి అంటే అంద‌రికి గారాబం. ఆమెకు ఆఫ్రికాలోనూ, అమెరికాలోనూ వ్యాపారాలు ఉన్నాయి. ఇటు భ‌ర్త సినిమా నిర్మాత‌గాను, అమెరికాలో వ్యాపారాల‌తో పాటు అక్క‌డ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ కూడా ర‌న్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆమెకు విష్ణు ప‌రిచ‌యం అయ్యాక‌, ఆమె మాట తీరు, మ‌ర్యాద కంటే కూడా ఆమెలో ఉన్న బిజినెస్ ల‌క్ష‌ణాల‌కు విష్ణు ముగ్ధుడు అయిపోయి ప్రేమ‌లో ప‌డిపోయాడ‌ట‌.

ఆమె సోష‌ల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటూ వ్యాపారాలు, కుటుంబంతో గడిపేందుకే ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. ఇక విష్ణు, వెరానికాల వ్యాపార సామ్రాజ్యం కోట్ల‌లోనే ఉంటుంది. ఆమెకు ఇంటి నుంచి క‌ట్న‌మే వైట్‌మ‌నీగా రు. 1000 కోట్లు ముట్టింద‌ని అంటారు. ఇవి కాకుండా చ‌రాస్థులు.. ఇత‌ర ఆస్తులు క‌లుపుకుంటే ఇంకెంత క‌ట్నం వ‌చ్చి ఉంటుంద‌నుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news