యంగ్ హీరోయిన్ శ్రీలీలకు ప్రస్తుతం టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ వచ్చేసింది. అసలు శ్రీలీల పేరు చెబితేనే స్టార్ హీరోల నుంచి.. మిడిల్ రేంజ్ హీరోల వరకు పూనకాలతో ఊగిపోతున్నారు. ఆమె కచ్చితంగా తమ సినిమాలో ఉండాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చేసింది. అటు ఎన్టీఆర్ సినిమాలను ఆమె కచ్చితంగా నటించే అవకాశాలు ఉన్నాయి.
నందమూరి బాలకృష్ణ 108వ సినిమాలో శ్రీలీల బాలయ్యకు కూతురు పాత్రలో నటిస్తోంది. ఇక టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలు అయితే కేవలం శ్రీలీల కాల్షీట్ల కోసమే తమ సినిమా షూటింగులను వాయిదా వేసుకుంటున్న పరిస్థితులు కూడా వచ్చేసాయి. ప్రస్తుతం శ్రీలీల పేరు అంతలా మారుమోగిపోతుంది.
నిన్న మొన్నటివరకు సినిమాకు 40 నుంచి 50 లక్షలు మాత్రమే తీసుకున్న శ్రీలీల ఎప్పుడు ఏకంగా కోటిన్నర వరకు డిమాండ్ చేస్తుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ఎన్బీకే 108 సినిమాతో పాటు తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. తాను ఎప్పుడూ ఆనందంగా ఉంటూ చాలా శ్రద్ధతో తన పని చేస్తానని చెప్పుకొచ్చింది. చాలా లక్‌తోనే తాను ఈ రంగంలోకి వచ్చానని.. ఎప్పుడూ జనాల మధ్య ఉండడమే తనకు ఇష్టం అని.. చివరకు అదే నాకు వృత్తిగా మారిందని తెలిపింది.
ఇక బాలకృష్ణకు తాను ముందు నుంచే వీరాభిమానిని అని.. ఆయనతో కలిసి నటించాక మరింత పెద్ద అభిమానిగా మారిపోయానని చెప్పింది. బాలకృష్ణ వ్యక్తిత్వం చాలా గొప్పదని.. అందరితోనూ ఎంతో చక్కగా మాట్లాడతారని.. అంత స్టార్ హీరో అయినా… చక్కటి వ్యక్తిత్వం చూపుతారని శ్రీలీల బాలయ్య బాబును ఆకాశానికి ఎత్తేసింది. శ్రీలీల కాంప్లిమెంట్లతో బాలయ్య ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఆయనతో సీన్లలో నటిస్తున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉన్నానని.. అలాగే డైలాగుల విషయంలో ఎలాంటి తప్పులు చేయకుండా చాలా అప్రమత్తంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఎన్బీకే 108లో తన రోల్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని.. ఈ సినిమా చూశాక తన రోల్‌తో అందరూ సర్ఫ్రైజ్ అవుతారని చెప్పింది. ఇక శ్రీలీల ప్రస్తుతం త్రివిక్రమ్ – మహేష్ సినిమాతో పాటు రామ్ పోతినేని, నవీన్ పోలిశెట్టి, పంజా వైష్ణవ్ తేజ్‌తో కలిసి కొన్ని సినిమాలు చేస్తోంది.