Moviesమ‌నోజ్‌తో గొడ‌వ‌పై అన్న మంచు విష్ణు షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చాడుగా…!

మ‌నోజ్‌తో గొడ‌వ‌పై అన్న మంచు విష్ణు షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చాడుగా…!

టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ అంటే క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. మోహన్ బాబు ఇతర విషయాలలో ఎలా ? ఉన్నా తన వారసులను క్రమశిక్షణతో పెంచారు. అయితే గత కొద్దిరోజులుగా మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య ఏదో గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. మనోజ్ పెళ్లికి విష్ణు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోవడంతో ఈ అనుమానాలు మరింతగా బలపడ్డాయి. ఇక ఈరోజు మనోజ్ తమ బంధువు సారథి ఇంటిపై అన్న‌ విష్ణు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయటం.. అది వైరల్ కావడం జరిగింది.

మోహన్ బాబు కూడా మనోజ్‌కు వార్నింగ్ ఇవ్వడంతో ఆ వెంటనే మనోజ్ ఆ పోస్టు డిలీట్ చేశాడు. అప్పటికే అది వైరల్ అయిపోయింది. ఈ వివాదంపై మంచు విష్ణు స్పందించారు. ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ మా ఇద్దరి మధ్య గొడవలు సాధారణమే అని.. అది నిన్న ఉదయం జరిగిన చిన్న ఘటన అని తెలిపాడు. సారధితో వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేకపోయాడు.. అందుకే ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడ‌న్నారు.

మనోజ్ చిన్నవాడు… నా తమ్ముడు, ఆ వీడియో గురించి స్పందించాల్సినంత పెద్ద విషయం కాదు అంటూ విష్ణు వివరణ ఇచ్చాడు. మరోవైపు అన్నదమ్ముల మధ్య వివాదం గురించి సోదరి మంచు లక్ష్మి కూడా స్పందించారు. తాను విష్ణు, మనోజ్ తో మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో ? చెబుతానని ఆమె తెలిపారు. ఏది ఏమైనా తన ఇద్దరు వారసులు ఇలా గొడవ పడడం… ఆ విషయం వీడియో రూపంలో బయటకు రావడంతో మోహన్ బాబు తీవ్ర మనస్థాపానికి గురైనట్టు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news