టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా శాకుంతలం . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది . ఇదే క్రమంలో తన హెల్త్ బాగో లేకపోయినా సరే సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సమంత తనదైన స్టైల్ లో సినిమాకు హైప్ క్రియేట్ చేయడానికి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాకి వీలైనంత ప్రమోషన్స్ తీసుకొస్తుంది.
కాగా ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకి సంబంధించిన కీలక విషయాలను బయటపెట్టిన సమంత.. రీసెంట్గా మరో ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను బయటపెట్టి సంచలనానికి తెరతీసింది . శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత సంచలన కామెంట్స్ చేసింది . తన వైవాహిక జీవితానికి సంబంధించి షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది .
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” సమంత విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది నన్ను బాధ పెట్టారని ..అప్పుడే పుష్ప సినిమాలో ఊ అంటావా మామ ఆఫర్ రావడంతో ..ఆ సాంగ్ చేస్తున్నాను అని తెలిసి ఫ్రెండ్స్ కూడా మండిపడ్డారని.. నేను ఏ తప్పు చేయనప్పుడు నేను ఎందుకు బాధపడాలి.. ఇంట్లోనే కూర్చోవాలి..అని అనిపించి తెగించి ఈ నిర్ణయం తీసుకున్నానని .. ఆ పాటను అనౌన్స్ చేసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిన వాళ్ళు ఆ పాట చేయొద్దు అంటూ ఫోర్స్ చేశారని..అయితే విడాకులకి నేనేం కారణం కాదు.. వైవాహిక బంధం లో నేను 100% నిజాయితీగా ఉన్నాను అని..అది వర్కౌట్ అవలేదు ..అలాంటప్పుడు నేను ఎందుకు తప్పు చేసిన దానిలా బాధపడాలి.. ఎందుకు నన్ను నేనే హింసించుకుంటూ ఇంట్లో కూర్చోవాలి ..అని తెగించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను” అంటూ గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పుకు వచ్చింది .ఈ క్రమంలోని విడాకుల విషయంలో తప్పు సమంతది కాదు నాగ చైతన్య దే అంటూ పరోక్షకంగా కామెంట్ చేసి అసలు విషయాన్ని బయట పెట్టేసింది సమంత అంటూ సామ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!