Moviesఅలా చేయమని సుజాత టార్చర్‌ పెట్టిందా..? వీళ్ళ పెళ్లి వెనుక అంత...

అలా చేయమని సుజాత టార్చర్‌ పెట్టిందా..? వీళ్ళ పెళ్లి వెనుక అంత జరిగిందా..? రాకేష్ కన్నీళ్లు.. !!

ప్రజెంట్ సోషల్ మీడియాలో జోర్దార్ సుజాత – రాకింగ్ రాకేష్ ల పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కాగా జబర్దస్త్ షో ద్వార సూపర్ కామెడీని పండిస్తూ నెంబర్ వన్ కమెడియన్ రాజ్యమేలేస్తున్నాడు రాకేష్. జబర్దస్త్ తో పాటు పలు ఈవెంట్స్ లో కామెడీ స్కిట్స్ వేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ యూట్యూబ్ ద్వారా కూడా ఇన్కమ్ సంపాదించుకుంటున్న రాకింగ్ రాకేష్ రీసెంట్ గాని సుజాతను పెళ్లి చేసుకున్నాడు .

కాగా జబర్దస్త్ లో స్కిట్స్ వేసే టైంలోనే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించి .. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లి ఫైనల్లి భార్యాభర్తలు గా మారారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఈ జంట జబర్దస్త్ లో తమదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ శుక్రవారం టెలికాస్ట్ కావాల్సిన ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్ కన్నీళ్లు పెట్టుకుంటూ జోర్దార్ సుజాతపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .

స్కిట్లో భాగంగా ఓ స్కిట్లో నిజం చెప్తే కాయ చెట్టు పైకి వెళ్తుందని.. అబద్ధం చెప్తే కదలదనేది కాన్సెప్ట్ . కాగా ఈ క్రమంలోనే జోర్దార్ సుజాత పై ఫన్నీగా కామెంట్స్ చేశాడు రాకింగ్ రాకేష్ . సుజాత ది నిజమైన ప్రేమ అని.. గాఢమైన ప్రేమ అని.. రాకేష్ చెప్పగా కాయ కదలదు. కానీ ప్రేమించమని.. పెళ్లి కోసం టార్చర్ చేసింది అని,,రాకేష్ చెప్పడంతో కాయ పైకి వెళ్ళింది. దీంతో ఒక్కసారి అక్కడ జనాలు అంత షాక్ అయిపోయారు .

దీంతో నిజంగానే జోర్దార్ సుజాత రాకేష్ ను పెళ్లి కోసం అంత టార్చర్ చేసిందా ..? అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ షో ఈ శుక్రవారం ఈటీవీలో ప్రసారం కానుంది .పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే కానీ అసలు మ్యాటర్ ఏంటి అనేది అర్థం అవ్వదు . అయితే ఇదంతా టిఆర్పి ల కోసమే చేశారు అన్న సంగతి అందరికీ తెలిసిన ..కొత్త జంటపై ఇలాంటి కామెడీ చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news