అక్కినేని వారసుడు నాగచైతన్య తెలుగు అమ్మాయి శోభిత దూళిపాళ్ల ఇటీవల తరచూ వార్తల్లో వ్యక్తులుగా ఉంటున్నారు. నాగచైతన్య – సమంత నాలుగేళ్ల పాటు కలిసి కాపురం చేశాక విడాకులు తీసుకున్నారు. చైతు – సమంత విడిపోయి కూడా ఏడాదిన్నర అవుతోంది. సామ్ తో విడిపోయాక చైతు ఎక్కువగా శోభితతో కనిపిస్తున్నాడు అన్నది వాస్తవం. గత ఏడాదికాలంగా వీరిద్దరూ కలిసి ఎన్నోసార్లు ఫోటోలకు చిక్కారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీరిద్దరి డేటింగ్ వార్తలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.
రెండు నెలల క్రితమే వీరిద్దరూ కలిసి హాలీడే ట్రిప్ కు వెళ్లారని కూడా వినిపించాయి. తాజాగా వీరికి సంబంధించిన మరో ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. చైతు – శోభిత కలిసి లండన్ లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ కి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ చెఫ్ గా ఉన్న తెలుగు వ్యక్తి సురేంద్రమోహన్, నాగచైతన్యతో ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ ఫోటో వెనకాల టేబుల్ వద్ద శోభిత స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తన మొఖం కనిపించకుండా చేయి అడ్డుపెట్టుకొని కవర్ చేసేందుకు ప్రయత్నించిన ఫోటో క్లియర్ గా కనిపిస్తోంది.
ఇక చైతు సన్నిహితులు.. ఇండస్ట్రీలో చైతును దగ్గర నుంచి చూస్తున్న వారు కూడా చైతు ప్రేమలో పడ్డాడు అని చెబుతున్నారు. చైతు శోభితను ప్రేమిస్తున్నాడని అంటున్నారు. ఇక శోభిత తెలుగు అమ్మాయి కావటం విశేషం. ఆమె 1993 మే 31న వేణుగోపాలరావు, శాంతారావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో జన్మించింది. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. విశాఖపట్నంలోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్ – విశాఖ వ్యాలీ స్కూల్ లో ఆమె చదివింది. ఆ తర్వాత ముంబై యూనివర్సిటీ, హెచ్ ఆర్ కాలేజీలో కామర్స్, ఎకనామిక్స్ పూర్తి చేసుకుంది.
ఆమె భారతీయ సాంప్రదాయ నృత్యాలు అయిన భరతనాట్యం, కూచిపూడి లో కూడా బాగా శిక్షణ పొందిన డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ముందుగా బాలీవుడ్ లో అనురాగ్ కాశ్యప్ దర్శకత్వంలో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అడవి శేష్ తో ఆమె చేసిన గూఢచారి, మేజర్ రెండు సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఇటు వెబ్ సిరీస్ల్ లో నటిస్తూ దూసుకుపోతోంది.
ఇక చైతు ఈసారి అచ్చ తెలుగు అమ్మాయిని.. అందులోనూ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి అయిన శోభితను పెళ్లి చేసుకోనున్నాడని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు మొదలైపోయాయి. మరి ఈ హీరోయిన్ తో అయినా చైతు వైవాహిక బంధం కలకాలం ఉంటుందని ఆశిద్దాం.