Moviesద‌స‌రా డైరెక్ట‌ర్ శ్రీకాంత్‌కు.. సిల్క్‌స్మిత‌కు ఉన్న లింక్ ఇదే…!

ద‌స‌రా డైరెక్ట‌ర్ శ్రీకాంత్‌కు.. సిల్క్‌స్మిత‌కు ఉన్న లింక్ ఇదే…!

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సినిమా దసరా. నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా శ్రీరామనవమి కానుకగా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. నాని కెరీర్ లో దసరా సినిమా చాలా స్పెషల్. నాని నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా దసరా కావటం విశేషం. 70 కోట్ల భారీ బడ్జెట్ తో తరికెక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల‌ దర్శకుడు. శ్రీకాంత్ కి దర్శకుడుగా ఇదే తొలి సినిమా. తెలంగాణకు చెందిన శ్రీకాంత్ ఎంతో నమ్మకంతో ఈ సినిమాను తెరకెక్కించారు.

శ్రీకాంత్ కు తెలంగాణ భాష, యాసపై మంచి పట్టు ఉన్నట్టు దసరా సినిమా టీజర్లు, ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక అలనాటి మేటి అందాల తార సిల్క్ స్మితకు శ్రీకాంత్ ఓదెలకు చిన్న లింకు ఉంది. ఆ లింకు ఏంటో తెలిస్తే ? ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. శ్రీకాంత్ తాత రామగుండం బొగ్గు గనులలో పనిచేసే కార్మికుడు. ఆయన ఒకసారి శ్రీకాంత్ కు కల్లు తెమ్మని పంపాడట. కల్లు దుకాణంకు వెళ్లిన శ్రీకాంత్‌కు పక్కనే గోడ మీద ఉన్న సిల్క్ స్మిత పోస్టర్ కనిపించింది.

ఆ పోస్టర్‌ను అలాగే చూసిన శ్రీకాంత్ ఎందుకో మనసునిండా ఆమెనే నింపుకున్నాడు. తర్వాత సిల్క్ స్మిత పోస్టర్ తెచ్చుకుని తన ఇంట్లో గోడకు అంటించుకున్నాడట. ఆ పోస్ట‌ర్‌ను 15 ఏళ్ల పాటు అలా చూస్తూనే పెరిగే పెద్దవాడయ్యాడు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ సిల్క్ స్మిత జీవితం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఆమెకు సినిమా పట్ల ఆ రోజుల్లోనే ఎంత ఫ్యాషన్ ఉందో కూడా శ్రీకాంత్ కు అర్థమైంది. అలా ఆమె గురించి లోతుగా ఆలోచిస్తున్న కొద్ది చాలా విషయాలు తెలియటం.. ఆరోజుల్లోనే ఆమె అంత డేరింగ్ పాత్రలు చేయటం నిజంగా శ్రీకాంత్‌ను మెస్మరైజ్ చేసిందట.

అందుకే తాను దర్శకుడు అయినా కూడా సిల్క్ స్మితను మాత్రం ఏమాత్రం మర్చిపోలేదు. ఆమె పై తనకు ఉన్న ప్రేమను అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. దసరా సినిమా ప్రమోషన్లలో కూడా తన టీ షర్టుపై సిల్క్ స్మిత ఫోటో వేయించుకుని మరి పాల్గొంటున్నాడు. అలాగే దసరా సినిమా ప్రమోషన్లకు కూడా సిల్క్ స్మిత ఫొటో బాగా వాడుతున్నారు. నిజంగా సిల్క్ స్మితపై శ్రీకాంత్ కు ఇంత గొప్ప ప్రేమ ఉందని.. దసరా సినిమా పోస్టర్లపై సిల్క్ స్మిత ఫోటో ఉండటానికి కారణం ఇదే అని.. మనోడు చెప్పేవరకు ఎవరికీ తెలియదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news