టీవీ9 రిపోర్టర్ దేవి నాగవల్లి, టాలీవుడ్ ప్రముఖ యంగ్ హీరో విశ్వక్సేన్ మధ్య వివాదం గురించి అందరికీ తెలిసిందే. విశ్వక్సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్లలో విశ్వక్సేన్ హైదరాబాదులో జూబ్లీహిల్స్ లో ఒక రోడ్డుమీద చేసిన ఫ్రాంక్ వీడియో కాస్త కాంట్రవర్సీ అయింది. వెంటనే టీవీ 9 వాళ్లు పెద్ద డిబేట్ పెట్టేసి.. దీనిపై రాద్దాంతం మొదలు పెట్టేశారు. తన ఫ్రాంక్ వీడియోపై డిబేట్ నడుస్తుండగానే విశ్వక్సేన్ స్వీట్ బాక్స్ పట్టుకొని నేరుగా టీవీ9 ఆఫీస్ కి వెళ్ళాడు.
అక్కడ జరిగిన చర్చలో దేవీ నాగవల్లి – విశ్వక్సేన్ మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే నాగవల్లి విశ్వక్సేన్ను గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ అవమానపరిచింది. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయింది. సోషల్ మీడియాలో విశ్వక్సేన్ కు ఎక్కువ మంది సపోర్ట్ చేశారు. ఇక ప్రస్తుతం విశ్శక్ దర్శకత్వంలో తానే హీరోగా వచ్చిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ సినిమా థియేటర్లలో మంచి టాక్ తో ముందుకు దూసుకు వెళుతుంది.
తొలిరోజు ఏకంగా తొమ్మిది కోట్ల గ్రాస్ వసుళ్ళు కొల్లగొట్టింది. ఫస్ట్ వీక్ండ్ ముగిసేసరికే ఈ సినిమా కొన్న వారందరికీ భారీ లాభాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఓ డైలాగు కావాలని దేవి నాగవల్లిని ఉద్దేశించి పెట్టారంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఓ సీన్ లో హీరోయిన్ ని కారులో తీసుకు వెళుతున్న విశ్వక్సేన్ మెడికల్ షాప్ దగ్గర ఆపమంటావా ? అంటూ ఒక అసహ్యకరమైన డైలాగ్ వేస్తాడు.
దానికి హీరోయిన్ గెట్ అవుట్ ఫ్రమ్ మై కార్ అంటూ డైలాగ్ చెబుతుంది. ఎందుకు ? మెడికల్ షాప్ లో కండోమ్ కొనడానికా అంటాడు హీరో. అయితే ఈ డైలాగ్ దేవీ నాగవల్లిని ఉద్దేశించి కావాలని సెటైరికల్ గా వాడినట్టుగా కనిపిస్తోందని.. దేవీ నాగవల్లి అప్పుడు విశ్వక్సేన్ ను గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ వేసిన డైలాగ్ కు కౌంటర్ గా ఈ డైలాగ్ పెట్టినట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా విశ్వక్సేన్ కు కాంట్రవర్సీలు బాగా కలిసి వస్తున్నాయి.