సినిమా రంగం అంటేనే అంతా గుసగుసలు.. గాసిప్లే ఉంటాయి. ఇక్కడ జరిగేది తక్కువ.. చెప్పేది ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. హీరోలు, హీరోయిన్లు, నటులు, నటీమణుల మధ్య, హీరోయిన్లు దర్శక నిర్మాతల మధ్య ఎఫైర్లు ఉన్నట్టు కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తూ ఉంటాయి. ఇందులో చాలా విషయాలు నిజాలు .. కొన్ని అబద్ధాలు కూడా ఉంటాయి. ఒక అమ్మాయి.. అబ్బాయి కాస్త చనువుగా ఉన్నారంటేనే పెడ అర్థాలు తీసే లోకం ఇది. ఇలాంటి పెడ అర్థాలకు తెలుగు సినిమా రంగంలో ఒక సీనియర్ నటుడు కూడా బలి అవ్వాల్సి వచ్చింది.
విచిత్రం ఏమిటంటే ఓ నటీమణి ఆయనకు సపరియలు చేసినందుకు గాను.. ఏకంగా ఆయన కుటుంబ సభ్యులు ఆమెతో ఆయనకు అక్రమ సంబంధం అంటగట్టేశారు. ఆ నటుడు ఎవరో కాదు తెలుగు సినిమా రంగంలో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు. గుంటూరు జిల్లా రావికంపాడులో జన్మించిన గుమ్మడి వెంకటేశ్వరరావు తెలుగు సినిమా రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా ఎన్నో సినిమాలలో నటించారు. రాష్ట్ర ప్రభుత్వం బహుకరించే రఘుపతి వెంకయ్య అవార్డు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది.
అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చింది. అలాంటి గుమ్మడి కి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సినిమాలకు దూరమయ్యాక ఆయన హైదరాబాద్ లో ఒంటరిగా ఉండేవారు. గుమ్మడి పిల్లలు అందరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు. చివరకు జీవిత చరమాంకంలో వాళ్ళు గుమ్మడిని కూడా సరిగా పట్టించుకోలేని పరిస్థితి. అయితే సీనియర్ నటి జయలలిత గుమ్మడిని చివరి దశలో బాగా చూసుకున్నారు.
జయలలిత మంచి శాస్త్రీయ నృత్యకారిణి.. నటి, తెలుగు సినిమాలలో ఆమె ఎక్కువగా శృంగార, హాస్య పాత్రలతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. గుమ్మడి పిల్లలు అమెరికాలో ఉండడంతో ఆయన యోగక్షేమాలు తెలుసుకునేందుకు జయలలిత ప్రతిరోజు ఆయన ఇంటికి వెళ్లే వారట. అలాగే గుమ్మడి ప్రతిరోజు జయలలితకు ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ జయమ్మ ఎలా ఉన్నావ్ ? అని విష్ చేసేవారట. ఇక జయలలిత దుబాయ్, సింగపూర్ వెళ్ళినప్పుడు గుమ్మడి కి బాగా ఇష్టమైన మద్యం కొని తీసుకువచ్చేవారట.
అయితే ఆయన వాటిని అలా అపురూపంగా చూసుకుంటూ కాలం గడిపేవారని.. చివరకు తన ఫోన్ నుంచే తాను ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడించే దానిని అని.. అయితే ఆ కుటుంబ సభ్యులు తనకు, గుమ్మడి గారికి అక్రమ సంబంధం అంటగట్టేసారని జయలలిత తాజా ఇంటర్వ్యూలో వాపోయింది. అయినా తాను ఎక్కడా వెనక్కు తగ్గలేదని.. లోకులు కాకులు ఎవరేమనుకున్న తాను మాత్రం గుమ్మడి గారిని ప్రేమతో చూసుకున్నానే తప్ప.. ఆయన వయసుకి నా వయసుకి ఆ మాట అన్న వాళ్లకే వదిలివేశానని చెప్పింది.
ఎన్టీఆర్ కు లక్ష్మీపార్వతి ఎలాగో గుమ్మడికి జయలలితకు కూడా అలా అని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపణలు చేసేవారని.. చివరకు ఆయన చనిపోయే ముందు కూడా నా హృదయం మీద పడుకుని మాటలు చెబుతూనే ప్రాణాలు వదిలారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఏది ఏమైనా గుమ్మడి లాంటి మహానటుడిపై సొంత కుటుంబ సభ్యులే ఈతరహ ఆరోపణలు చేయడం వారి విజ్ఞతకే వదిలివేయాల్సి ఉంది.